నీట మునిగిన జవహర్ నవోదయ పాఠశాల. పరిశీలించిన మంత్రి, ఉన్నతాధికారులు.



నీట మునిగిన జవహర్ నవోదయ పాఠశాల. పరిశీలించిన మంత్రి, ఉన్నతాధికారులు. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

 ప్రకాశం జిల్లా ఒంగోలు,గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జిల్లా యంత్రాంగం రౌండ్ ది క్లాక్ పనిచేసి తుఫాన్ ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడంతో పాటు ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. 

మొంథా తుఫాన్ నేపథ్యంలో ఒంగోలు నగరంలోని జవహర్ నవోదయ విద్యాలయం తరగతి గదులు, వంట రూములు నీట మునగడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతుండటంతో బుధవారం ఉదయం రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా,,డోలా. బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ పి రాజాబాబు, స్థానిక శాసన సభ్యులు దామచర్ల జనార్ధన రావు, ఒంగోలు పట్టణాభివృద్ది సంస్థ చైర్మన్ ఎస్.కె రియాజ్, ఒంగోలు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ . వెంకటరావు, అధికారులతో కలసి విద్యాలయంను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్ధులతో, విద్యాలయం సిబ్బంది తో మాట్లాడి పరిస్థితులను తెలుసుకోవడం జరిగింది. విద్యార్దులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు త్రాగునీరు, భోజన వసతులు చేపట్టాలని అధికారులను ఆదేశించడమైనది. 

అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, మొంథా తుఫాన్ నేపధ్యంలో జిల్లా యంత్రాంగం అంతా కష్టపడటం వలన ప్రాణ ఆస్తి నష్టాన్ని నివారించడం జరిగిందన్నారు. తుఫాన్ సమయంలో ఇద్దరు ముగ్గురు ను రిస్కు చేసి కాపాడటం జరిగిందన్నారు. జిల్లాలో ఉన్న అన్ని ట్యాంకులు నిండి ఉన్నాయని, ఎక్కడైనా ట్యాంక్ లు గండ్లు పడే పరిస్థితి ఉన్నప్పుడు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. తుఫాన్ కు ముందే మన జిల్లాలో భారీ వర్షాలు కురియడంతో తుఫాన్ నేపథ్యంలో కురిసిన వర్షాలు వలన వర్షాలు భూమి లో ఇంకే పరిస్థితి లేక ఎక్కడికక్కడే లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు స్టాగ్నేషన్ కావడం జరిగిందన్నారు. జిల్లా యంత్రాంగం నిలిచి పోయిన వర్షం నీటిని ఈరోజు సాయంత్రానికి క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. జిల్లా కలెక్టర్ గారి సారథ్యం లో గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు జిల్లా యంత్రాంగం రౌండ్ ది క్లాక్ పనిచేసి తుఫాన్ ప్రభావాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడం జరిగిందని, ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో పంట నష్టం బాగానే ఉంది. పశ్చిమ ప్రాంతంలో మొక్కజొన్న, పత్తి, శనగ, సజ్జ, మిర్చి పంటలకు నష్టం జరిగింది. పంట నష్టం అంచనాల నివేదికను కూడా తయారు చేయడం జరుగుతుందన్నారు. ఇంతటి ఇపత్తులో ప్రాణ నష్టాన్ని నివారించినందుకు జిల్లా యంత్రాంగానికి ప్రత్యేక అభినందనలు తెలియచేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి గారు నిన్న ఉదయం నుంచి రాత్రి 11 గంటల వరకూ సచివాలయంలో ఉండి తుఫాన్ ఏర్పాట్లు పై నిరంతరం సూచనలు ఇస్తూ దిశానిర్దేశం చేస్తూ పర్యవేక్షించడం జరిగిందన్నారు. తుఫాన్ అనంతరం సహాయక చర్యలు పై, వర్షం నీటిని తొలగించడం వంటిచర్యలు పటిష్టంగా చేపట్టడం జరుగుచున్నదన్నారు. వర్షం నీరు తగ్గిన తర్వాత పంట నష్టాన్ని ఇతర నష్టాలను పూర్తి స్థాయిలో అంచనా వేసి ప్రభుత్వ పరంగా అందే సహాయాన్ని బాధితులకు అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు మాట్లాడుతూ, గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అన్నీ శాఖల సిబ్బంది సమన్వయంతో క్షేత్రస్దాయిలో ఉండి తుఫాన్ ప్రభావ పరిస్దితులను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. జిల్లాలో తుఫాను ప్రభావం వలన భారీ వర్షాలు కురిశాయన్నారు. పరిస్దితిని గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. నీట మునిగిన ప్రాంతాల్లో అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ వర్షం నీటిని త్వరగా క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదన్నారు. జిల్లాలో మొత్తం 70 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు 4వేల మంది లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగిందన్నారు.

ఒంగోలు శాసన సభ్యులు. దామచర్ల జనార్ధన రావు మాట్లాడుతూ, తుఫాన్ నేపధ్యంలో ఒంగోలు నగరంలో చాల కాలనీలు వర్షం నీటి మునగడం జరిగిందని, ఆ నీటిని త్వరగా క్లియర్ చేసేలా మునిసిపల్ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారన్నారు. ముంపు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు పడకుంటా త్వరితగతిన నీటిని తొలగించే ఏర్పాట్లు జరుగుచున్నవన్నారు. పారిశుధ్య కార్యక్రమంపై కూడా ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.  

అనంతరం మంత్రి ప్రభుత్వ గిరిజన కళాశాల బాలుర వసతి గృహం ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు.మంత్రి వెంట మున్సిపల్ కమీషనర్.వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాదికారి డా. వెంకటేశ్వర రావు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Add


 

Post a Comment

Previous Post Next Post