వైద్య శాఖ నిబంధనలు ఉల్లంగిస్తున్న ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి.


వైద్య శాఖ నిబంధనలు ఉల్లంగిస్తున్న ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి.

ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లలో తనికీలు నిర్వహించాలి.

క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టు ప్రకారం ఏ వ్యాధి నిర్ధారణ పరీక్షకు ఎంత డబ్బు తీసుకోవాలో పెద్ద అక్షరాలతో డిస్ ప్లే బోర్డు లో ప్రదర్శించాలి.

ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ ఆర్. పుష్ప కు ఏఐవైఎఫ్ బృందం వినతి.

ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితి డిమాండ్.

తెలంగాణ, హైదరాబాద్-కోటి.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి.

         రాష్ట్ర వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంగిస్తున్న ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని, డయాగ్నొస్టిక్ సెంటర్లు డిస్ ప్లే బోర్డ్ లలో వ్యాధి నిర్ధారణ పరీక్షల రేట్లను పొందుపరిచేలా ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కోఠి లోని ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ ఆర్. పుష్ప కు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా *ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి వలి ఉల్లా ఖాద్రీ, కల్లూరు ధర్మేంద్ర* లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అనుమతుల్లేకుండానే రోగ నిర్ధారణ కేంద్రాల నిర్వహణ,కనీస జాగ్రత్తలు పాటించకుండానే నమూనాల సేకరణ చేస్తున్నారన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్టు ప్రకారం ఏ వ్యాధి నిర్ధారణ పరీక్షకు ఎంత డబ్బు తీసుకోవాలో పెద్ద అక్షరాలతో ప్రదర్శించాలన్నారు. అలాంటివి ఎక్కడా జరగడం లేదన్నారు.నిబంధనల ప్రకారం రక్త, మూత్ర, మల పరీక్షల ఫలితాలను పాథాలజిస్ట్ గానీ, మైక్రో బయాలజిస్ట్ గానీ పరీక్షించి ఫలితాలు ఇవ్వాలి. కొన్ని ల్యాబ్లు అలాంటి నిబంధనలేవీ పాటించడం లేదని ధ్వజమెత్తారు. డియాగ్నస్టిక్ సెంటర్లు పేషంట్ లకు నిర్వహిస్తున్న రోగ నిర్ధారణ పరీక్షలకు సంబంధించిన నగదు వివరాలను సూచిక బోర్డ్ లలో పెట్టకుండా, అధిక ధరలు వసూళ్లు చేస్తున్నారని, అదే విధంగా పరీక్షల అనంతరం పేషెంట్ లకు తప్పుడు రిపోర్టుల ద్వారా సామాన్యులను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. అనుభవం లేని వైద్యులు ఆపరేషన్లు చేయడం, ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకొని అవగాహన లేమితో వైద్యం చేస్తున్నారని, ఇలా చేయడం వల్ల వేలల్లో బిల్లులు వేయడం పట్ల సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధ్వజమెత్తారు. లేని వ్యాధికి చికిత్సను పొందుతూ మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డయాగ్నొస్టిక్ సెంటర్లు మరియు ఆసుపత్రి యాజమాన్యాల మధ్య లోపాయికారి ఒప్పందం చేసుకొని కమిషన్లకు కక్కుర్తి పడి సామాన్య జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారన్నారు. హైదరాబాద్ నగరంలో పెద్ద బ్రాండ్లతో చెలామణీ అవుతూ, కేవలం ఒక బ్రాంచ్ కు అనుమతులు పొంది పదుల సంఖ్యలో డియాగ్నోస్ సెంటర్లను ఏర్పాటు చేశారని, అన్ని డయాగ్నోసిస్ సెంటర్లు ఒకే రకమైన రిపోర్ట్ లను పేషంట్ లకు ఇస్తున్నపుడు, డియాగ్నోస్ సెంటర్ల ఛార్జస్ లలో ఎందుకు వ్యత్యాసాలు ఎందుకు ఉంటాయో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు. డయాగ్నొస్టిక్ సెంటర్ల ధన దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోతుందన్నారు. డయాగ్నొస్టిక్ సెంటర్లు డిస్ ప్లే బోర్డ్ లలో వ్యాధి నిర్ధారణ పరీక్షల రేట్లను పొందుపరిచేలా ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేయాలని, లేకుంటే ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా డయాగ్నొస్టిక్ సెంటర్ల ముందు పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని వారు పిలుపునిచ్చారు.

       ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నెర్లకంటి శ్రీకాంత్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్. బాలకృష్ణ, కాంపల్లి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Add



 

Post a Comment

Previous Post Next Post