వన్యప్రాణి సంరక్షణ వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు అవగాహన సదస్సు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి. దాసరి యోబు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దిగువమెట్ట నల్లమల్ల అటవీ ప్రాంతంలోని వనవిహారి ప్రాంతంలో విద్యార్థులకు వన్యప్రాణి సంరక్షణ అంశంపై అవగాహన కార్యక్రమానికి నిర్వహించారు. ఈనెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు డిప్యూటీ డైరెక్టర్ నిషాకుమారి ఆదేశాల మేరకు వన్యప్రాణి వారోత్సవాలను నిర్వహించినట్లు అటవీశాఖ అధికారి నరసింహారావు తెలిపారు.
విద్యార్థులకు అడవులు, వన్యప్రాణుల సంరక్షణ అంశంపై అవగాహన కల్పించి వారికి డ్రాయింగ్ మరియు పోటీ పరీక్షలు నిర్వహించామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
పరీక్షలలో ప్రతిభ చాట్టిన విద్యార్థులకు బహుమతులు కూడా అందించామన్నారు. అడవులను వన్యప్రాణులను సంరక్షించుకోవడం వల్ల మానవ మనుగడ కొనసాగుతుందని లేదంటే మానవాళికి ముప్పు తప్పదని అటవీ శాఖ అధికారులు విద్యార్థులకు వెల్లడించినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ బి. వంశీకృష్ణకుమారి, బీట్ ఆఫీ సర్లు రామకృష్ణ, చేజర్లయ్య, కోటేశ్వరరావు, నాగ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Add

