స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏజెన్సీలో గిరిజనేతరులకు కేటాయించిన రిజర్వేషన్ తక్షణమే నిలిపివేయాలి- ఇరప.రాజు దొర.
భద్రాద్రి,ఆదిలాబాద్, కొమురం భీమ్ జిల్లాల జడ్పీ చైర్మన్ స్థానాలు ఎస్టీ లకే కేటాయించాలి-ఇరప.రాజు దొర.
(క్రైం 9మీడియా చర్ల ప్రతినిధి తాటి మధు)
తెలంగాణా
5వ షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరులకు కేటాయించిన రిజర్వేషన్ నిలిపివేయాలని,5వ షెడ్యూల్ ప్రాంతంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ రిజర్వేషన్లు గిరిజనులకే కేటాయించాలని ఆదివాసీ హక్కుల పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ ఇరప.రాజు దొర ఒక ప్రకటన లో డిమాండ్ చేసారు..ఇందులో భాగంగా బుధవారం పత్రిక ప్రకటన విడుదల చేశారు.ప్రభుత్వం ప్రకటించిన గిరిజనేతర రిజర్వేషన్ లో 5 వ షెడ్యూల్ ప్రాంతం లో మినహాయించుకోవాలని కోరారు... షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనేతరులకు అవకాశం ఇచ్చే రోటేషన్ పద్ధతిని తక్షణమే నిలిపివేయాలన్నారు.అధిక ఆదివాసులు జనాభా కలిగిన జిల్లాలో జిల్లా పరిషత్ స్థానాలకు ఎస్టీ రిజర్వేషన్ ఉండేలా చూడాలన్నారు..ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలన్నారు..ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జిల్లా పరిషత్ రిజర్వేషన్ లో ఆదివాసులు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఆదివాసీలు అధికంగా ఉన్న భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, కుంరం భీం, మహబూబాబాద్ జిల్లాలో జనరల్ స్థానాలుగా ప్రకటించడం ఆదివాసీ చట్టాలను పూర్తిగా విస్మరించడమే అన్నారు..
ఆదివాసీలు అధికంగా ఉన్న మండలాలలో జడ్పిటిసి ఎంపిటిసి స్థానాలను జనరల్ మరియు ఇతర వారికి రిజర్వ్ చేస్తూ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించడం వల్ల భారత రాజ్యాంగం 5 వ షెడ్యూల్ 1/70- పిసా చట్టాలను నిరుగార్చే ప్రయత్నమే అవుతోందన్నారు...కావున 5 వ షెడ్యూల్ ప్రాంతం జిల్లాల్లో జడ్పి చైర్మన్, అలాగే జడ్పీటీసీ స్థానాలను ఎస్టీ రిజర్వేషన్లు సరి చేయాలనీ డిమాండ్ చేశారు... 5 వ షెడ్యూల్ హక్కులను హరించేలా ప్రభుత్వ విధానము ఉందని అక్కడ నివసిస్తున్న స్థానిక ఆదివాసీ ప్రజల అవకాశాలను దూరం చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని వాటిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. లేనియెడల వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పడానికి ఆదివాసీ సమాజం సిద్ధంగా ఉంటుందని తెలియచేసారు.
