పండుగ వాతావరణం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం.






    పండుగ వాతావరణం లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమం.

ముఖ్య అతిథులుగా హాజరై పంపిణీ చేసిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు.

ఏలూరు క్రైం 9మీడియా ప్రతినిధి.

అక్టోబర్ 01:- ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతగా తీసుకుని ప్రతినెలా విధిగా సామాజిక పెన్షన్ల పంపిణీ క్రతువును సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు పునరుద్ఘాటించారు. నిరంతరం సామాన్యులకు అందుబాటులో ఉండడమే తన ఏకైక లక్ష్యమని బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరు 23వ డివిజన్‌ పిరంగుల దిబ్బలో బుధవారం ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం ఆ డివిజన్‌లోని అర్హులైన లబ్దిదారుల ఇళ్ళకు స్వయంగా వెళ్ళిన ఎమ్మెల్యే చంటి పెన్షన్‌ మొత్తాలను అందించారు. వారికి భరోసా కల్పించారు. 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపుమేరకు నిత్యం ప్రజల మధ్యనే ఉండేందుకు అత్యధిక సమయాన్ని కేటాయిస్తున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగానే ప్రతినెలా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో తానుకూడా భాగస్వామి అవ్వడంతో పాటూ, ఆయా ప్రాంతాల్లోని సామాన్యుల కష్టాలను స్వయంగా తెలుసుకుని, వారికి అండగా నిలబడేలా తక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలిచ్చిన అధికారాన్ని గర్వంగా తీసుకోకుండా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ వస్తున్నామన్న ఆయన, పేదప్రజలకు న్యాయ చేయడమే తన ఏకైక లక్ష్యమని చెప్పారు. 

ఏపీఎస్ ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వం ధ్యేయం అని, సామాజిక పింఛన్లు పంపిణీ కార్యక్రమాన్ని ప్రతినెలా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక పండుగలా నిర్వహిస్తూ, పింఛను దారులకు మరింత అండగా నిలుస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం శాంతినగర్ 9వ రోడ్డు వద్ద ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. ఈ కార్యక్రమ లో ఈడా ఛైర్మన్‌ పెద్దిబోయిన శివప్రసాద్, ఎఎంసి చైర్మన్‌ మామిళ్ళపల్లి పార్థసారధి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ ఎ. భానుప్రతాప్‌, ఏలూరు నగర టిడిపి అధ్యక్షులు చోడే వెంకటరత్నం, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, జనసేన జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, స్థానిక కార్పొరేటర్‌ కలవకొల్లు సాంబ, టిడిపి క్లస్టర్ ఇంచార్జ్ గూడవల్లి శ్రీనివాస్, జనసేన క్లస్టర్ ఇంచార్జీ పేటేటి రామకృష్ణ ప్రసాద్, టిడిపి డివిజన్ ఇంచార్జ్ రెడ్డి రామకృష్ణ, జనసేన డివిజన్ ఇంచార్జీ కుప్పాల చంద్రశేఖర్, కో - ఆప్షన్‌ సభ్యులు ఎస్సెమ్మార్‌ పెదబాబు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ నడపన వాణి, బీజేపీ నాయకులు నడపన దాన భాస్కర్ రావు, మరియు కుటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



Post a Comment

Previous Post Next Post