జంగారెడ్డిగూడెం సెప్టెంబర్ 30: మంగళవారం ప్రజాసంఘాల కార్యాలయంలో డివైఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది . ఈ సమావేశానికి జిల్లా కమిటీ సభ్యులు ఎస్కే మాబు అధ్యక్షత వహించగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జి సూర్య కిరణ్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండల పట్టణ మహాసభలు ఈనెల అక్టోబర్ 11 తారీఖున జంగారెడ్డిగూడెం పట్టణంలో నిర్వహించడం జరుగుతుందని ఈ మహాసభలకు యువతీ,యువకులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
డివైఎఫ్ఐ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు చంద్రశేఖర ఆజాద్ సుందరయ్య డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వంటి మహనీయుల ఆశయాల స్ఫూర్తితో నిరంతరం ప్రజా సమస్యల పట్ల అలాగే నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికై సేవా కార్యక్రమాలపై యువతరాన్ని సమీకరిస్తూ యువకులు జూద, క్రీడలకు మరియు దుర వ్యసనాలకు లోన్ అవకుండా ఆధ్యాత్మిక, సాంస్కృతిక నిర్వహిస్తుందని ఇటీవల దేశాన్ని పీడిస్తున్న మతోన్మాదం సంస్థలు యువకులను మతోన్మాదులుగా తయారు చేస్తూ దేశాన్ని మతతత్వ దేశంగా మార్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుందని భావితరాల భవిష్యత్తుకు భారత రాజ్యాంగం కల్పించిన హక్కులను కాపాడుకునేందుకు యువతి యువకులు ఆలోచనతో మహనీయుల స్ఫూర్తితో వారి ఆశయాలను నెరవేర్చేందుకు భావితరాల భవిష్యత్తు కొరకు ప్రతి ఒక్కరు స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని తెలియజేశారు.
అలాగే రానున్న రోజుల్లో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి ఆటల పోటీలు సేవా కార్యక్రమాలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలు లో భాగంగా లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన నరేంద్ర మోడీ ఇప్పటివరకు ఇవ్వకపోవడం నిరుద్యోగులను మోసం చేయడమేనని అలాగే విశాఖపట్నం ప్రైవేటీకరణ చేస్తూ అనేక ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దేశానికే దేశ యువతరానికి తీవ్రదోహం చేస్తున్న బిజెపి వైఖరి విడనాడాలని బిజెపికి కొమ్ముకాస్తున్న కూటమి ప్రభుత్వం తమ వైఖరిని మార్చుకోవాలని లేనిపక్షంలో యువకుల్ని ఐక్యం చేసి పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు నిరుద్యోగ సమస్యలపై పోరాటాలు అవినీతి అంతం డివైఎఫ్ఐ పంతం అన్నా నిరాదంతో ముందుకు వెళ్లాలని దానికి ప్రతి ఒక్కరు సహకరించి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఈ పోతురాజు ఏ రవి ఎన్ నాని తదితరులు పాల్గొన్నారు.
.jpg)
