క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు. అనకాపల్లి అక్టోబర్:12
ప్రభుత్వ,పోలీసులు తీరును ఖండిస్తు ఈనెల 15 న జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోను ఆందోళనులు చేపడ తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న స్పష్టం చేసారు నక్కపల్లి మండలం లోని సిపిఎం జిల్లాకార్యదర్శివర్గ సభ్యులు యం అప్పలరాజు గ్రుహా నిర్బాందాన్ని ఖండిస్తు ఆదివారం దేవరాపల్లిలో సిపిఎం శ్రేణులతో నిర్సన తెలిపారు అనంతరం అయిన మాట్లాడారు నక్కపల్లి మండలంలో రాజయ్య పేటలో బల్క్ డ్రగ్స్ పార్క్ కు వ్యతిరేకంగా వేలాది మంది మత్స్యకారులు సాంతియుతంగా అందోన చేస్తున్నారని దీన్ని పరిశీలించ డానికి రాష్ట్ర హోంమంత్రి అనితగారు గతనెల 29 న వెళ్ళారని తెలిపారు ఈ సందర్భంగా మత్స్యకారులు కారును అడ్డుకుని ఆందోళన చేపట్టారని దీనికి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు యం అప్పలరాజె కారణ మంటూ నాటి నుండి నేటివరకు అప్పలరాజును గ్రుహా నిర్బంధంలో ఉంచి కనీష అవసరాలకు కూడా వెళ్ళనియ్య కుండా చేయడం జరుగుతుందని ఇది పూర్తిగా అప్రజాస్వామిక మన్నారు ప్రభుత్వం ఈవిధంగా చేయడాన్ని వెంకన్న తీవ్రంగా తప్పు బట్టారు ప్రజా ఉద్యమ కారుల పై పోలీసులు రోడ్డుకాసి దోంగలకు ఇంటి దగ్గర కాపలా పెట్టినట్లు పెట్టడం అత్యంత హెయమైన చర్యని అన్నారు ఇటువంటి చర్యలు వల్లనే పోలీసులు పై ప్రజలకు పూర్తిగా విశ్వాసం గౌరవం పోతుందని తెలిపారు ప్రభుత్వం పోలీసులు అప్పరాజు గ్రుహా నిర్బంధం ఆపాక పోతే జిల్లా లోని మొత్తం సిపిఎం పార్టీ క్యాడర్ ను సభ్యులను ఛలో,నక్కపల్లి కార్యక్రమం చేపడతామని స్పష్టం చేశారు ఇప్పటికే నక్కపల్లి మండలం రాజయ్య పేటలో బల్క్ డ్రంగ్ పార్క్ వద్దంటు మత్స్యకారులు శాంతి యుతంగా నిరసన తెలియ జేస్తున్నారని ప్రజలపై ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవం ఉన్న వెంటనే నిలుపుదల చేయాలి తప్ప మత్స్యకారుల అభిప్రాయాలను గౌరవించి కుండా బల్క్‌డ్రగ్ పార్క్ ఎర్పాటు చేస్తామంటె జిల్లాలోని మత్స్యకారులు అందరు చూస్తు ఊరుకోరని ప్రభుత్వానికి తగిన గుణపాఠం చేబుతారని తెలిపారు.
ప్రజా స్వామ్యంలో నిరసనను స్వేచ్చగా తెలియ జేసే హక్కు ప్రజలకు ఉంటుందన్నారు గంగమ్మను నమ్ముకోని బ్రతుకు తున్న మత్స్యకారులపైన పదేపదే నిర్భందాలు ప్రయోగించడం అప్రజాస్వామికంగా వ్వవ హారించడం తీవ్ర అభ్యంతర కరమన్నారు ప్రతి పక్షంలో ఉన్నప్పుడు బల్క్‌డ్రగ్ పార్కు ప్రమాద కరమని నిన దించిన హోమంత్రి అనిత గారికీ నేడు అధి కారంలోకి రాగానే బల్క్ డ్రంగ్ పార్క్ ప్రమాదకరం కాకుండా పోతుందా అని ప్రశ్నించారు అనిత గారు ఇటు వంటి చర్యలకు పూనుకుంటే ప్రజలకు భవిష్యత్తు లో తగిన బుద్ధి చెబుతారని తెలిపారు బల్క్ డ్రగ్ పార్క్‌తో మత్స్యకారుల జీవ నోపాధి, స్థానిక ప్రజల ఆరోగ్యం, పర్యా వరణానికి తీవ్ర ప్రమాదం ఏర్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ పార్క్ నిర్మాణంతో సముద్ర కాలుష్యం పెరిగి మత్స్య సంపద నాశనం అవుతుందని. దీని ఫలితంగా వేలాది కుటుంబాలు తమ జీవనా ధారాన్ని కోల్పోతారని అన్నారు ప్రభుత్వం అభివృద్ధి పేరిట ప్రజల పునరా వాసం,జీవన భద్ర తలను పక్కన పెట్టి, కార్పొరేట్ లాభాల కోసం మాత్రమే కృషి చేస్తోందని. ప్రజల మనో భావాలను గౌరవించ కుండా, స్థానిక ప్రజల అభి ప్రాయాన్ని పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరించడం సరైనది కాదని వెంటనే పోలీసులు నిర్బంధాన్ని ఆపాలని సిపిఎం పార్టీ అప్పలరాజు గ్రుహా నిర్బందాన్ని ఆపాలని లెదంటే ఈనెల 15 జిల్లా లోని అన్నిమండలాల్లోను అందోనులు చేస్తామని తెలిపారు దీనికి ప్రజాస్వామ్య వాదులు వామపక్ష ప్రజాసంఘాలు స్వచ్ఛందంగాగా పల్గోని జయప్రదం చేయాలని వెంకన్న కోరారు.
Add

