ఎవరెస్టుపై మంచుతుఫానులో 1000 మంది దిగ్బంధం.
ఎవరెస్ట్ పర్వతంపై భారీ మంచు తుఫాను బీభత్సం సృష్టించింది. టిబెట్ వైపున 16,000 అడుగుల ఎత్తులో సుమారు 1000 మంది చిక్కుకుపోయినట్లు స్థానిక మీడియా తెలిపింది. చిక్కుకున్నవారిలో కొందరు హైపోథెర్మియాతో బాధపడుతున్నారు. సహాయక చర్యలు చురుగ్గా కొనసాగుతున్నాయి. స్థానికులు కూడా రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొంటున్నారు. మరోవైపు, నేపాల్‌లో కూడా భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం జరుగుతోంది.
