పడిపోయిన ‘టమాటా’ ధరలు.. కేజీ రూ.4.
ఆంధ్రప్రదేశ్ : కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. పండగకు ముందు వరకు కేజీ రూ.8-10 పలికింది. ఆదివారం ఏకంగా కేజీ రూ.4కు పడిపోయింది. నిరాశకు గురైన రైతులు పంటను రోడ్డుపై పారబోశారు. దిగుబడి విక్రయించగా వచ్చిన అరకొర సొమ్ముతో మార్కెట్ కమీషన, కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా చేతి నుంచే చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.
