గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడు ప్రగడ గణేష్‌కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 1,00,000/- జరిమానా – జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.


 గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడు ప్రగడ గణేష్‌కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 1,00,000/- జరిమానా – జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.

క్రైమ్ 9 మీడియా ప్రతినిధి - పి. మహేశ్వరరావు.

జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్).

అనకాపల్లి (చోడవరం), అక్టోబర్ 8: గంజాయి అక్రమ రవాణా కేసులో నిందితుడు ప్రగడ గణేష్ తండ్రి సత్యనారాయణ (38), ముకుందపురం గ్రామం, వీ.మాడుగుల మండలం, కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు1,00,000/- జరిమానా విధిస్తూ, జరిమానా చెల్లించని పక్షంలో ఇంకా 2 సంవత్సరాలు 6 నెలల అదనపు సాధారణ జైలు శిక్ష విధిస్తూ, చోడవరం 9వ అదనపు జిల్లా జడ్జి ఎం.హరి నారాయణ ఈరోజు తీర్పు వెలువరించారు.

*కేసు నేపథ్యం:* 

2015 నవంబర్ 11న ఉదయం 10 గంటల సమయంలో, చోడవరం పోలీస్ స్టేషన్‌కు చెందిన అప్పటి ఎస్సై బి.రమణయ్య సిబ్బందితో కలిసి చోడవరం కొత్తూరు జంక్షన్ వద్ద పక్కా సమాచారం మేరకు వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో, వడ్డాది గ్రామం వైపు నుండి నిందితుడు ప్రగడ గణేష్ ఏపీ 05 ఏపీ 2799 నంబరు గల కారులో 5 గోనె బస్తాలలో 100 కిలోల గంజాయి రవాణా చేస్తున్నాడు. పోలీసులు రావడాన్ని గమనించిన నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించగా, వెంటపడి పట్టుకుని చోడవరం పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ 153/2015 కింద కేసు నమోదు చేశారు.

దర్యాప్తులో నిందితుడు పాడేరు పరిసర ఏజెన్సీ ప్రాంతాల నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, గోనె బస్తాలలో నింపి ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు రవాణా చేస్తున్నట్టు తేలింది. పోలీస్ బృందం నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించింది.

ఈ కేసులో అప్పటి ఎస్సై బి.రమణయ్య సమగ్ర దర్యాప్తు జరిపి, న్యాయస్థానంలో అభియోగపత్రం దాఖలు చేశారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూ.వెంకటరావు న్యాయస్థానంలో సమర్థంగా వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలు, వాదనల ఆధారంగా న్యాయస్థానం ఈ రోజు పైశిక్షను విధించింది.

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, గంజాయి కేసులో న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పోలీసు శాఖకు విజయంగా అభివర్ణిస్తూ, ఈ కేసులో కృషి చేసిన అప్పటి దర్యాప్తు అధికారి ఎస్సై బి.రమణయ్యకి, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యూ.వెంకటరావుకి, చోడవరం పోలీసులకు మరియు కోర్టు మానిటరింగ్ సెల్ సిబ్బందికి అభినందనలు తెలిపారు.

Post a Comment

Previous Post Next Post