తెలంగాణలో భారీ వర్షాలు.. మొoథా తుఫాన్ ఎఫెక్ట్.
క్రైమ్ 9మీడియా..తెలంగాణ ప్రతినిధి... అక్టోబర్ 29: తెలుగు రాష్ట్రాలపై మొoథా తుఫాన్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్ష సూచన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు నేపథ్యంలో మధ్యాహ్నం హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్ లో భారీ వర్షం పడింది లోతట్టు ప్రాంతాలు జలమయం తో నిండిపోయాయి. హైదరాబాద్ వాతావరణ శాఖ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మంచిర్యాల ,పెద్దపెల్లి,భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్ ,నల్గొండ, సూర్యాపేట ,జిల్లా లకు ఎల్లో జారీ చేసినప్పటికీ భారీ వర్షం ఏర్పడింది. రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించారు.
