ఏలూరు జిల్లాలో మొంథా తుఫాన్ సన్నాహాలపై పర్యటన -మంత్రి నాదెండ్ల.
ప్రజలను అప్రమత్తం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్.
క్రైమ్9 మీడియా ప్రతినిధి ఏలూరు, అక్టోబర్, 28:- ఏలూరు జిల్లా ఇంచార్జ్ మంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలం, మణుగులూరు గ్రామం లో మొంథా తుఫాన్ ప్రభావిత వల్ల కొల్లేరు లోని పెదయడ్లగాడి వంతెనను పరిశీలించారు. ఉప్పుటేరు లో గుర్రపుడెక్క, తూడు తొలగించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అక్కడ ప్రజలకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకి తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు, జిల్లా యంత్రాంగాన్ని పోలీసు అధికారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వారితో పాటు శాసనమండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ , ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు , ఆంధ్ర ప్రదేశ్ వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ఘంటసాల వెంకటలక్ష్మి , జనసేన నాయకులు నారా శేషు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు,కొల్లేరు ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

