తుఫాన్ బాధిత కుటుంబాలకు నిత్యవసరకులు, 25 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని సిపిఎం పార్టీ మండల కమిటీ డిమాండ్.
క్రైమ్9మీడియా ప్రతినిధి , అక్టోబర్ 29:- జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో ఏర్పాటు చేసిన తుఫాన్ పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన సిపిఎం పార్టీ మండల కమిటీ బృందం.
జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం మండల కమిటీ సభ్యులు జీ సూర్య కిరణ్. మాట్లాడుతూ మత్స్యకారుల కుటుంబాలను, సమస్యలను తెలుసుకోవడం జరిగింది. వేగవరం గ్రామంలో జడ్పీ హైస్కూల్ నందు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం ఉన్నటు వంటి కుటుంబాలకు 50 కేజీల బియ్యంతో పాటు, సరుకులు పప్పు, నూనె, తదితర సరుకులతో కుటుంబానికి 25 వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎర్ర కాలువ రిజర్వాయర్ మత్స్యకారుల సంఘం సభ్యులు కుటుంబాలు సంబంధించి 270 మంది ఉన్నారని వారిలో వేగవరం పునరావాస కేంద్రానికి 40 మంది కుటుంబాలని తరలించారని తెలిపారు. మిగిలిన కుటుంబాలు కొంగ వారి గూడెం ప్రాంతంలో ఉన్నారని అక్కడున్నటువంటి 20 కుటుంబాలకు పైగా ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వ అధికారులు వారిని పట్టించుకోవడంలేదని విమర్శించారు. భోజన వసతులు సంబంధించిన ఏర్పాటులు లేక మత్స్యకారుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఈ పునరావాస కుటుంబాలకు దోమల తెరలు, దుప్పట్లు, వసతులు తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి రూ 1000/-పరిహారం ఇవ్వడం సరికాదన్నారు. ప్రతి కుటుంబానికి 25 వేల రూపాయలు ఇచ్చి ప్రజల పట్ల కూటమి ప్రభుత్వం సిద్ధ శుద్ధి చూపించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు బొడ్డు రాంబాబు ఏ ప్రభాకరరావు సభ్యులు సిహెచ్ రవి మత్స్యకారుల సంఘం ప్రెసిడెంట్ దాసరి బాబురావు పంతుల శ్రీనివాసరావు పంతుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

