కార్మికశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసిన ఎ పి డబ్ల్యూ జే ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు.

కార్మికశాఖ మంత్రిని కలిసి వినతిపత్రం అందజేసిన  ఎ పి డబ్ల్యూ జే ఎఫ్ ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)

పి. మహేశ్వరరావు.

అనకాపల్లి అక్టోబర్:10

వర్కింగ్ జర్నలిస్టులను కార్మిక సంక్షేమ బోర్డులో చేర్చేందుకు గల అవకాశాలను పరిశీలిస్తానని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ హామీ ఇచ్చారు. 

ఆంధ్ర ప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రతినిధి వర్గం ఆయనను కలిసి జర్నలిస్టులను కార్మిక సంక్షేమ బోర్డులో చేర్చాలని చేసిన విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు. గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే విలేకరులు నిర్దిష్టమైన సదుపాయాలు ఆదాయాలు లేని పరిస్థితులలో పనిచేస్తున్నారని వారికి అసంఘటితరంగా కార్మికులు పొందే సదుపాయాలు కల్పించేందుకు వీలుగా కార్మిక సంక్షేమ బోర్డులో చేర్చాలని ఏపీ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ చేసిన ప్రతిపాదన పై మంత్రి ఈ హామీ ఇచ్చారు.రాష్ట్రంలో జర్నలిస్టుల వేతనాల అమలు తీరుకు సంబంధించి జస్టిస్ గురుభక్ష మాటిజియా సిఫార్సుల అమలు జరుగుతున్న తీరుతన్నులను పర్యవేక్షించేందుకు వీలుగా ట్రైపాక్షిక కమిటీ ఏర్పాటుకు కూడా తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.కార్మిక శాఖ మంత్రిని కలిసిన ప్రతినిధి వర్గంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు నాయకులు ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Add



Post a Comment

Previous Post Next Post