ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ ఆర్ సిపి చేపట్టనున్న కోటి సంతకాల సేకరణ.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీనివాస్.విజయవాడ పశ్చిమలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ ఆర్ సిపి కోటి సంతకాల ప్రజా ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం.
కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన మండలి సభ్యులు మొహ్మద్ రుహుల్లా, పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, వైసిపి శ్రేణులు.
పేద విద్యార్థులు, ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ విద్యార్థులు డాక్టర్లవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు.
గతంలో రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజ్ లు ఉంటె జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 17 మెడికల్ కాలేజ్ లకు భూములు కేటాయించి నిర్మాణ పనులను ప్రారంభించారు.
7 మెడికల్ కాలేజిల నిర్మాణం పూర్తి చేసారు.
వైద్య విద్యను కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లలో ప్రారంభమైంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ సీట్లు వద్దు అని కేంద్ర ప్రభుత్వానికి లేక రాసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కింది.
ప్రయివేటీకరణకు మొగ్గుచూపుతు జోబులు నింపుకునే పనిలో కూటమి ప్రభుత్వం ఉంది.
జగన్ మోహన్ రెడ్డి గారి వైజాగ్ నుంచి నర్సీపట్నం పర్యటనలో అనేక ఇబ్బందులకు గురిచేసారు.
ఎన్ని ఇబ్బందులు పెట్టిన జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజాదరణ తగ్గలేదు.
వేలాదిగా ప్రజలు పాల్గొని నీరాజనాలు పలికారు.
ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసారు.
కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీని 2 లక్షల 50వేలకే పరిమితం చేసారు.
జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ తో వైద్యం చేపించుకునే అవకాశం ఉండేది.
ప్రయివేటు వ్యక్తుల లాభాపేక్ష కోసం మెడికల్ కాలేజ్ లను ప్రయివేటీకరణ చేస్తున్నారు.
కోట్ల రూపాయలలో మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారు.
యువత గాని, మహిళలు గాని, రైతులు గాని అన్ని విభాగాల వారు కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకంగా ఉన్నారు.
అక్టోబర్ 10 నుంచి నవంబర్ 24 వరకు మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సొంతకాల సేకరణ కార్యక్రమాన్ని దశల వారీగా నిర్వహిస్తాము.
గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్లి కోటి సంతకాల పాత్రలను అందజేస్తాము.
మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణ పై ఉద్యమాలు చేసి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.
రాబోయే రోజుల్లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత మెడికల్ కాలేజ్ ల పిపిపి విధానాన్ని కాంట్రాక్ట్ లను రద్దు చేస్తాం.
చంద్రబాబు ఒక్క కాలేజ్ కూడా నిర్మించలేదు.
కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి శ్రేణులు అందరు భాగస్వామ్యమై విజయవంతం చేయాలి.
స్థానిక బ్రాహ్మణ వీధిలోని విజయవాడ పశ్చిమ వైసిపి కార్యాలయంలో మాజీ మంత్రివర్యులు, విజయవాడ పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు సూచనల మేరకు శుక్రవారం నాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ ఆర్ సిపి చేపట్టనున్న కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసనమండలి సభ్యులు మొహమ్మద్ రుహుల్లా పాల్గొని పశ్చిమ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులతో కలిసి పోస్టర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రాయన భాగ్యలక్ష్మి, మహ్మద్ రుహుల్లా, కర్నాటి రాంబాబు లు మాట్లాడుతూ పేద విద్యార్థులు, ఎస్సి, ఎస్టీ, బిసి, మైనారిటీ విద్యార్థులు డాక్టర్లవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని గతంలో రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజ్ లు ఉంటె జగన్ మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 17 మెడికల్ కాలేజ్ లకు భూములు కేటాయించి నిర్మాణ పనులను ప్రారంభించి 7 మెడికల్ కాలేజిల నిర్మాణం పూర్తి చేసారని వైద్య విద్యను కూడా ప్రారంభమైందన్నారు. మాకు మెడికల్ సీట్లు వద్దు అని కేంద్ర ప్రభుత్వానికి లేక రాసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రయివేటీకరణకు మొగ్గుచూపుతు జోబులు నింపుకునే పనిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారు వైజాగ్ నుంచి నర్సీపట్నం పర్యటనలో అనేక ఇబ్బందులకు గురిచేసారని, ఎన్ని ఇబ్బందులు పెట్టిన జగన్ మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజాదరణ తగ్గలేదని, వేలాదిగా ప్రజలు పాల్గొని నీరాజనాలు పలికారన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆరోగ్యశ్రీని 2 లక్షల 50వేలకే పరిమితం చేసారని జగన్ మోహన్ రెడ్డి గారి హయాంలో 25 లక్షల వరకు ఆరోగ్యశ్రీ తో వైద్యం చేపించుకునే అవకాశం ఉండేదన్నారు. 2 లక్షల 50 వేల రూపాయలు దాటిన ప్రతి వైద్యానికి ముఖ్యమంత్రిని కలిస్తేనే వైద్యం చెప్పించుకునే అవకాశం ఉందని ఇది ఎంతవరకు సాధ్యమని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రయివేటు వ్యక్తుల లాభాపేక్ష కోసం మెడికల్ కాలేజ్ లను ప్రయివేటీకరణ చేస్తున్నారన్నారు. కోట్ల రూపాయలలో మెడికల్ సీట్లు అమ్ముకుంటున్నారు. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు ఉంటె వేల మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించవచ్చన్నారు. యువత గాని, మహిళలు గాని, రైతులు గాని అన్ని విభాగాల వారు కూటమి ప్రభుత్వానికి వెతిరేకంగా ఉన్నారన్నారు. అక్టోబర్ 10 నుంచి నవంబర్ 24 వరకు మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సొంతకాల సేకరణ కార్యక్రమాన్ని దశల వారీగా నిర్వహించి అనంతరం గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్లి కోటి సంతకాల పాత్రలను అందజేస్తామని మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణ పై ఉద్యమాలు చేసి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజల వద్ద నుంచి సంతకాలు సేకరించడం జరుగుతుందని తెలిపారు. రాబోయే రోజుల్లో వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత మెడికల్ కాలేజ్ ల పిపిపి విధానాన్ని కాంట్రాక్ట్ లను రద్దు చేస్తామని తెలిపారు. మెడికల్ కాలేజ్ ల ప్రయివేటీకరణ చాలా దుర్మార్గమైన చర్య అని చంద్రబాబు ఒక్క కాలేజ్ కూడా నిర్మించలేదన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసిపి శ్రేణులు అందరు భాగస్వామ్యమై విజయవంతం చేయాలనీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పశ్చిమ వైసిపి కార్పొరేటర్లు, వైసిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Add


