జీఎస్టీ తగ్గింపు పై మార్కాపురం పట్టణంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన కందుల.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం పట్టణంలోని 15 వ వార్డులో ఎన్ డి ఏ ప్రభుత్వం తగ్గించిన జిఎస్టి పై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలను ఇప్పటికే అమలు చేశామని ఇక జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్రంలో 8 వేల కోట్ల పనులు ఆధార్రాష్ట్రంలో 8 వేల కోట్ల పనులు రాష్ట్ర ప్రజలకు ఆదా చేస్తున్నామని ఈ జీఎస్టీ రేట్ల తగ్గింపుతో పేద మధ్యతరగతి వర్గాలు అధికంగా లాభం పొందుతాయని దీని ద్వారా నిత్యవసర వస్తువులు, వ్యవసాయ రంగంలో వ్యవసాయ పనిముట్లు, వ్యాపార వర్గాలు అధికంగా ప్రయోజనం పొందుతాయని అన్నారు.
త్వరలోనే మార్కాపురం ప్రత్యేక జిల్లా గా మన ప్రభుత్వం ప్రకటించబోతుందని తద్వారా ఈ ప్రాంత చుట్టుపక్కల ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందుతాయని గుర్తు చేశారు.
ఇక ఈ ప్రాంతానికి ఎస్సీ ఎస్టీలకు స్మశాన వాటిక కూడా ఏర్పాటు చేశామని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఎన్ డి ఎ నాయకులు, 15వ వార్డు ఎన్ డి ఏ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.

