మా సమస్యలు పట్టించుకొండి సమస్యలపై వినతి.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి, జిల్లా ఇంచార్జి (క్రైమ్).
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి అక్టోబర్:05
మాడుగుల(మండలం)
కే.జె.పురం గ్రామంలో ఉన్న తెలకలదీపం కాలనీ సమస్యలపై స్థానికులు వినతిపత్రం అందజేశారు. కాలనీలో కాలువలు, రోడ్లు. వేయాలని, శ్మశాన ప్రాంతం తుప్పలతోను, డొంకలతోను నిండిపోయి అడవిని తలపిస్తుందని, వాటిని తొలగించాలని కోరారు. ఉపాధి హామీ పథకం ద్వారా వాటిని శుభ్రం చేయాలన్నారు. అలాగే తెలకల దీపం ప్రాంతాలకు స్వీపర్లు నెలకు ఒకసారి మాత్రమే వస్తున్నారని, వారానికి ఒకసారి వచ్చి శుభ్రం చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ కేజే. వురం పంచాయతీ కార్యదర్శి బి నవీన్ దొరకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో కొల్లాటి అమ్మ తల్లి నాయుడు, బెల్లంకి శ్రీనివాసరావు, డెక్కల అప్పారావు, గుంట్ల కొండలరావు పాల్గొన్నారు.
