కర్నూలు జిల్లా కేంద్రంలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల రాత పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్.



 కర్నూలు జిల్లా కేంద్రంలో అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల రాత  పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ  విక్రాంత్ పాటిల్.

పరీక్ష కేంద్రం వద్ద పటిష్ట భద్రత.

అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకానికి అక్టోబరు 5 న రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు రాత పరీక్షలు నిర్వహిస్తున్నది. 

పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు 42 అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్ కు జారీ చేసింది.  

పరీక్షలు రాసే అభ్యర్దులకు విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు జిల్లాలలో పరీక్ష కేంద్రాలను కేటాయించారు. 

ఈ సంధర్బంగా ఆదివారం కర్నూలు జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో పరీక్షలు జరుగుతున్న తీరును కర్నూల్ జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. 

ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ రాత పరీక్ష ప్రశాంత వాతవారణంలో కొనసాగుతుందన్నారు.  

కర్నూలు పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న ఈ పరీక్షకు 261 మంది హాజరయ్యారన్నారు. 

రెండు విడతల్లో 

పేపర్‌-1 ఉదయం 10 గంటల నుంచి ఒంటి గంట వరకు, 

పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు నిర్వహిస్తున్నారన్నారు.ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారి వెంట అడిషనల్ ఎస్పీ అడ్మిన్ హుస్సేన్ పీరా, కర్నూలు తాలుకా సిఐ తేజమూర్తి ఉన్నారు.

Post a Comment

Previous Post Next Post