ప్రజా ఫిర్యాదుల వేదికలో 55 ఫిర్యాదుల స్వీకరణ – సత్వర పరిష్కారానికి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాలు.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి. జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (క్రైమ్)
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి, అక్టోబర్ 13: అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల వేదిక.
( పి జి ఆర్ ఎస్) కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, మొత్తం55 ఫిర్యాదులను స్వీకరించారు. వాటిలో భూ తగాదాలు – 28, కుటుంబ కలహాలు – 6, ఇతర విభాగాలకు చెందినవి – 21 గా గుర్తించబడ్డాయి.
ఈ సందర్భంగా ఎస్పీ తుహిన్ సిన్హా సంబంధిత అధికారులకు ఆదేశిస్తూ,ప్రతి ఫిర్యాదును నిశితంగా పరిశీలించి వాస్తవాలు నిర్ధారించగానే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. 7 రోజుల లోపు విచారణ పూర్తిచేసి తగిన పరిష్కారం చూపాలి. చేపట్టిన చర్యల వివరాలను జిల్లా పోలీసు కార్యాలయానికి సమర్పించాలి, అని సూచించారు.
ఫిర్యాదు దారులతో స్వయంగా మాట్లాడి వారి సమస్యలను శ్రద్ధగా విన్న ఎస్పీ ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే పోలీసుల ప్రధాన కర్తవ్యం. ప్రజా సమస్యలను న్యాయపరంగా పరిష్కరించడంలో అనకాపల్లి జిల్లా పోలీసులు పూర్తి కట్టుబాటుతో పని చేస్తున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.దేవ ప్రసాద్తో పాటు ఎస్సై శిరీష మరియు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
