క్రైమ్ 9మీడియా ప్రతినిధి. జిల్లా ఇంచార్జ్ రిపోర్టర్ (క్రైమ్).
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి,(చోడవరం) అక్టోబర్ 14: అనకాపల్లి జిల్లా చోడవరం మండలంలో భారీగా 275 కిలోల గంజాయి పట్టుబడిన ఘటనపై చోడవరం పోలీసులు, అనకాపల్లి సబ్-డివిజన్ డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, దిశానిర్దేశానుసారం మీడియా సమావేశం నిర్వహించారు.
వివరాలు ఇలా ఉన్నాయి:-
ఏ 1 వంతల దేవదాస్
సన్ ఆఫ్- బలరాం, అలియాస్- శివ, తర్లగూడ గ్రామం, వనగుమ్మ పంచాయతీ, ముంచంగిపుట్టు మండలం, ఎ ఎస్ ఆర్ జిల్లా వ్యక్తి (అబ్స్కాండింగ్) ఒడిశా రాష్ట్రంలోని చిత్రకొండ ప్రాంతం నుండి గంజాయి సమకూర్చాడు
*A2 చంద్రభాన్ బిష్ణోయ్,* జోధ్‌పూర్, రాజస్థాన్ (అబ్స్కాండింగ్) కు పంపించేందుకు ప్రణాళిక సిద్ధం చేశాడు.
ఈ క్రమంలో అతడు
ఏ 4 బిసోయి మోహన్ బాబు, సన్ ఆఫ్ సహదేవ్ (28), ఏ 5 బిస్సాయి విజయ్ కుమార్, సన్ ఆఫ్- బిస్సాయి లైకోన్ (23), ఏ 6 వంతల వెంకటరావు, అలియాస్ బుద్దు, అలియాస్ వెంకీ సన్ ఆఫ్- వంతల మల్లేశ్వరరావు (21) లను పైలట్లుగా ఉపయోగించుకున్నాడు.
ఏ 1 వంతల దేవదాస్ 275 కిలోల గంజాయిని టాటా కరవ్వ్ (రిజి. నెం. ఏపీ 40 ఎఫ్ జి 5612) వాహనంలో 8 బాగ్‌లలో ప్యాక్ చేసి, ముంచంగిపుట్టు – పాడేరు – 12వ మైలు రాయి – కోణం మార్గం ద్వారా చోడవరం వైపు తరలిస్తుండగా, 12-10-2025 న సాయంత్రం సుమారు 4.00 గంటల సమయంలో చోడవరం పోలీసులు పట్టుకున్నారు.
దీని నేపథ్యంలో చోడవరం పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నంబర్ 241/2025 యు/ఎస్ 20(బి)(ii)(సి), సెక్షన్.25 ఆర్/ డబ్ల్యూ 8(సి) అఫ్ ది . ఎన్. డి. పి. ఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, 13-10-2025 న నిందితులను న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు పంపించారు.
ఈ ఆపరేషన్‌ను అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా మార్గదర్శకత్వంలో, సబ్ డివిజన్ డీఎస్పీ శ్రావణి ఆధ్వర్యంలో, చోడవరం సీఐ పీ.అప్పలరాజు, ఎస్ఐలు బి.నాగ కార్తీక్, బి.జోగారావు మరియు వారి సిబ్బంది ఆధునిక సాంకేతిక సహకారంతో విజయవంతంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, మాట్లాడుతూ — గంజాయి మరియు ఇతర డ్రగ్స్ కు సంబంధించిన నేరాలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారు. యువత డ్రగ్స్ వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. డ్రగ్స్ సరఫరా లేదా వాడకానికి సంబంధించిన ఏ సమాచారం తెలిసినా ప్రజలు పోలీసులకు తెలియజేయాలి అని విజ్ఞప్తి చేశారు.
ముద్దయిల వివరాలు:
ఏ 1. వంతల దేవదాస్, సన్ ఆఫ్- బలరాం అలియాస్ శివ, తర్లగూడ గ్రామం, వనగుమ్మ పంచాయతీ, ముంచంగిపుట్టు మండలం, ఎ ఎస్ ఆర్ జిల్లా — (అబ్స్కాండింగ్)
ఏ 2. చంద్రభాన్ బిష్ణోయ్, జోధ్‌పూర్, రాజస్థాన్ — (అబ్స్కాండింగ్)
ఏ 3. కొచ్చం సురేంద్ర,అలియాస్ గురు, సన్ ఆఫ్- లైచోన్, కారు డ్రైవర్, మేహ్బ గ్రామం, మాకవరం పంచాయతీ, ముంచంగిపుట్టు మండలం, ఎ ఎస్ ఆర్ జిల్లా — (అబ్స్కాండింగ్)
ఏ 4. బిసోయి మోహన్ బాబు.సన్ ఆఫ్. సహదేవ్, 28 సంవత్సరాలు, ఎస్ టి. వాల్మీకి, కుంబిరిపాడ గ్రామం, మాకవరం పంచాయతీ, ముంచంగిపుట్టు మండలం, ఎ ఎస్ ఆర్ జిల్లా — (అరెస్టేడ్)
ఏ 5. బిస్సాయి విజయ్ కుమార్ సన్ ఆఫ్. బిస్సాయి లైకోన్, 23 సంవత్సరాలు, ఎస్ టి వాల్మీకి, ఆటో డ్రైవర్, కుంబిరిపాడ గ్రామం, మాకవరం పంచాయతీ, ముంచంగిపుట్టు మండలం, ఎ ఎస్ ఆర్ జిల్లా — (అరెస్టేడ్)
ఏ 6. వంతల వెంకటరావు అలియాస్ బుద్దు,అలియాస్ వెంకీ సన్ ఆఫ్- వంతల మల్లేశ్వరరావు, 21 సంవత్సరాలు, ఎస్ టి (కోందు), వ్యవసాయం, తర్లగూడ గ్రామం, వనగుమ్మ పంచాయతీ, ముంచంగిపుట్టు మండలం, ఎఎస్ ఆర్ జిల్లా — (అరెస్టేడ్)
*స్వాధీనం చేసుకున్న వస్తువులు:*
1. తెలుపు రంగు ప్లాస్టిక్ గొనె మూటల్లో ప్యాక్ చేసిన 275 కిలోల గంజాయి
2. టాటా కరవ్వ్ కార్ (రిజి. నెం. ఏపీ 40 ఎఫ్ జి 5612)
3. పల్సర్ బైక్ (రిజి. నెం. ఏపీ 31 ఇటీ 0858) — (ఏ 5)
4. పల్సర్ బైక్ (రిజి. నెం. ఏపీ 31 డీసీ 3111)
5. సామ్ సంగ్ ఆండ్రాయిడ్ ఫోల్డింగ్ మొబైల్ (ఏ 4)
6. వివో లైట్ బ్లూ ఆండ్రాయిడ్ మొబైల్ (ఏ 4)
7. రియల్మి డార్క్ గ్రే ఆండ్రాయిడ్ మొబైల్ (ఏ 5)
8. వివో డార్క్ మెటల్లిక్ గ్రీన్ ఆండ్రాయిడ్ మొబైల్ (ఏ 5)
9. రియల్మి లైట్ పర్పుల్ ఆండ్రాయిడ్ మొబైల్ (ఏ 6)
ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, సబ్ డివిజన్ డీఎస్పీ శ్రావణి, చోడవరం సీఐ పీ.అప్పలరాజు, ఎస్ఐలు నాగ కార్తీక్, జోగారావు మరియు పోలీస్ సిబ్బందిని అభినందించారు
