జిఎస్టి తగ్గించకుండా ఔషదాలు అమ్మకాలు చేస్తే కేసులు నమోదు - ఔషధ నియంత్రణ శాఖా అసిస్టెంట్ డైరెక్టర్ కళ్యాణచక్రవర్తి.


 జిఎస్టి తగ్గించకుండా ఔషదాలు అమ్మకాలు చేస్తే కేసులు నమోదు - ఔషధ నియంత్రణ శాఖా అసిస్టెంట్ డైరెక్టర్ కళ్యాణచక్రవర్తి.

 జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి సెల్వి ఆదేశాలతో జిల్లా అంతటా ఔషధ దుకాణాలను తనిఖీ చేసిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు  చింతలపూడిలో రెండు, ఏలూరులో ఒక దుకాణాలపై కేసులు నమోదు.

ఔషధాలకు సంబంధించి జిఎస్టి ఉల్లంఘనలపై 9491063158 ఫోన్ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చు.

 ఏలూరు అక్టోబర్, 12: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన జీఎస్టీ పన్ను తగ్గింపులను ప్రతి ఒక్కరు అమలు చేయాల్సిందేనని ఉల్లంఘించిన వారిపై కేసు నమోదు చేస్తామని జిల్లా ఔషధ నియంత్రణ శాఖా అసిస్టెంట్ డైరెక్టర్ కళ్యాణచక్రవర్తి చెప్పారు. జిల్లాలో పాత జిఎస్టి ప్రకారం ఔషధాలు అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారంపై జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి జిల్లా ఔషధ నియంత్రణ శాఖ అధికారులను జిల్లా వ్యాప్తంగా ఔషధ దుకాణాలను తనిఖీ చేయాల్సిందిగా ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలపై ఔషధ నియంత్రణ శాఖా అసిస్టెంట్ డైరెక్టర్ కళ్యాణచక్రవర్తి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం, తణుకు ఔషధ నియంత్రణ అధికారులు ఆదివారం జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. . చింతలపూడిలో 8 దుకాణాలను తనిఖీ చేయగా విన్ కేర్ మరియు మరొక దుకాణంలోను, ఏలూరులోని స్వాతి మెడికల్స్ లో ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించామని, వాటిపై కేసులు నమోదు చేశామని కల్యాణ చక్రవర్తి చెప్పారు. ఈ సందర్భంగా కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ ఔషధ ధరలకు సంబంధించి 18, 12 శాతం స్లాబ్ లో ఉన్న మందులను ఐదు శాతం స్లాబ్ లోకి తీసుకు రావడం జరిగిందని, కేన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందులకు పూర్తిగా జిఎస్టి మినహాయించడం జరిగిందన్నారు. కానీ కొన్ని దుకాణాల వారు తమ బిల్లింగ్ ప్రాసెస్ లో సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోకుండా వినియోగదాల నుంచి పాత జీఎస్టీ నే వసూలు చేస్తున్నారని, వారిపై కేసు నమోదు చేశామన్నారు. జిల్లాలో మిగిలిన అన్ని దుకాణాలను తనిఖీ చేసి, పాత జిఎస్టి వసూలు చేసే వారిపై కేసు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రజలు తాము కొనుగోలు చేసిన ప్రతీ ఔషధాలకు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలని, ఔషధాలకు సంబంధించి జిఎస్టి ఉల్లంఘనలపై 9491063158 ఫోన్ నెంబర్ కు ఫిర్యాదు చేయవచ్చని కళ్యాణ్ చక్రవర్తి విజ్ఞప్తి చేశారు. 

Add



 

Post a Comment

Previous Post Next Post