భారీగా తగ్గిన బంగారం ధరలు.
గత రెండు మూడు రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలో గురువారం కూడా బంగారం ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,910 తగ్గి రూ.1,20,490కి చేరగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,750 తగ్గి రూ.1,10,450కి పడిపోయింది. వెండి ధర కూడా రూ.1000 తగ్గి కిలో రూ.1,65,000గా ఉంది. ఈ ధరల తగ్గుదల రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు ఇదే విధంగా ఉంది.
