కొఠారి గ్రామం చెందిన దియా పాప అనారోగ్యం కారణంగా 1,00,600/- రూపాయలు ఆర్ధిక సహాయం.
శ్రీకాకుళం అక్టోబర్:14
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం కొఠారి గ్రామనికి చెందిన పావని ముద్దుల కుమార్తె దీయా అనే చిన్న పాపకి (వయస్సు 1 సం.6 నెలలు) న్యూమోనియా వ్యాధి సోకింది. శ్రీకాకుళంలో ఉన్న రిమ్స్ హాస్పిటలో వెంటిలేటర్పై వైద్యం అందిస్తూ ఉన్నారు. పాప ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆ పాపకు మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు.తల్లితండ్రులు పేదవారు కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఆర్ధిక పరిస్థితి అంత అంత మాత్రమే కావడంతో మెరుగైన వైద్యం కోసం దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.ఓఎస్జి ఫౌండేషన్ వైజాగ్ జిఎస్ ఫౌండేషన్, నారాయణ్ విజయనగరం శ్రావ్య,మను , స్టేటస్ పెట్టిన మిత్రులు, బందువులు,క్లాస్మెంట్, కొఠారి గ్రామ యువత,చుట్టూ పక్కన ఫ్రెండ్స్, శ్రీకాకుళం ఉన్న మా ఫ్రెండ్స్, చుట్టు ప్రాంతంలో ఉన్న యువత, ఉద్యోగస్తులు,స్వచ్ఛంద సంస్థలు తరుపున తక్షణ సహాయంగా 1,00,600/-. రూ కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది.
