క్రైమ్ 9మీడియా ప్రతినిధి,
జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)పి. మహేశ్వరరావు.
అనకాపల్లి పట్టణం, అక్టోబర్ 14: జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఆదేశాలు మరియు అనకాపల్లి సబ్ డివిజన్ డీఎస్పీ శ్రావణి పర్యవేక్షణలో, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటనారాయణ ఆధ్వర్యంలో అక్టోబర్ 13న అనకాపల్లి శారదా బ్రిడ్జ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల సమయంలో రెండు ఆటోలు పరిమితికి మించి స్కూల్ విద్యార్థులను ఎక్కించుకొని వస్తుండగా ఆపి పరిశీలించగా —
ఒక ఆటోలో 11 మంది విద్యార్థులు, రెండో ఆటోలో 13 మంది విద్యార్థులు ఉన్నట్లు గుర్తించారు.
ఈ సందర్భంగా పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 125 ప్రకారం రెండు ఆటోలపై కేసులు నమోదు చేశారు. అదేవిధంగా, జిల్లా ఎస్పీ సూచనల మేరకు సంబంధిత ఆటో డ్రైవర్ల లైసెన్సులను రద్దు చేయుటకు (కాన్సలేషన్) అనకాపల్లి ఆర్టీఓ కార్యాలయానికి పంపడమైనది.
విద్యార్థుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి నిర్లక్ష్యాలకు భవిష్యత్తులో కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, హెచ్చరించారు.
