సచివాలయంలో రికార్డులు తనిఖీ చేసిన ఎంపీడీవో వీరభద్రాచారి.

సచివాలయంలో రికార్డులు తనిఖీ చేసిన ఎంపీడీవో వీరభద్రాచారి. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు

ప్రకాశం జిల్లా కంభం మండలంలోని కంభం-2 గ్రామ సచివాలయాన్ని కంభం మండల ఎంపీడీవో టి. వీరభద్రాచారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సమయపాలన తప్పక పాటించాలని సూచించారు. 

ఉదయం,సాయంత్రంవేళలోసమయానికిహాజరువేయాలన్నారు. ఉద్యోగుల హాజరు రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్, పలు రికార్డులను, సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితాలను పరిశీలించారు. 

ప్రస్తుతం సచివాలయం పరిధిలో జరుగుచున్న సర్వేల ప్రోగ్రెస్ ను అడిగితెలుసుకున్నారు.

పారిశుద్ధ్యం, రెవెన్యూ, వివిధ సమస్యలపై కార్యదర్శి, వీఆర్వో తో చర్చించారు, హౌసింగ్ సంబంధించి విషయాలను ఇంజనీరింగ్ అసిస్టెంట్ ని అడిగి తెలుసుకున్నారు. 

ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడానికి కృషి చేయాలని సిబ్బందికి సూచించారు.
 

Post a Comment

Previous Post Next Post