బోయికింతడలో గ్రామ సభ విజయవంతం.
క్రైమ్ 9 మీడియా ప్రతినిధి, జిల్లా ఇంచార్జి రిపోర్టర్ (క్రైమ్)
పి. మహేశ్వరరావు.
అనకాపల్లి అక్టోబర్:17
దేవరాపల్లి మండలం,బోయిల కింతాడ గ్రామ సచివాలయం వద్ద గ్రామ సర్పంచ్ మరియు దేవరాపల్లి మండల వైఎస్అర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూరె బాబురావు అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం నుండి అమలు చేస్తున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు నిమిత్తం కోరకు మొదటి గ్రామసభ మరియు గ్రామ పంచాయతీ సాధారణ గ్రామ సభ ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్న ఉపాధి హామీ వేతన కార్మికులు,గ్రామ ప్రజలు అందరికి అవగాహన కల్పించి గ్రామ అభివృద్ధికి కావలిసిన ఉపాధి పనులు గుర్తించి వాటితో పాటు గ్రామంలో అనేక అభివృద్ధి పనులుఫై,గ్రామం లోఉన్న ఇతర ప్రజా సమస్యలపై సమస్యలు పరిస్కారం కొరకు చర్చించి అలాగే గ్రామ ప్రజలు అందరూ గ్రామ పంచాయతీ అభివృద్ధికి అన్ని రకాలుగా సహకారం అందించాలి అని కోరుతూ ప్రజలకు ఈ యొక్క కార్యక్రమంలో స్వామిత్వ సర్వే, ఇతర అంశాలు కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి అర్జున్,గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు మరియు గ్రామ పెద్దలు అన్నం సాంబమూర్తి , బొబ్బిలి రాము కోన శ్రీను.కొప్పాక శంకరరావు అన్నం శంకరరావు.కోమార బాబురావు.కడిమి నాగేశ్వరావు,గ్రామ సచివాలయం సిబ్బంది,ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
