పాకాల బీచ్ లో పర్యటించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి.


పాకాల బీచ్ లో పర్యటించిన సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి.


ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు 

 ప్రకాశం జిల్లా పాకాల బీచ్ ను పర్యాటకులను మరింత ఆకర్షించేలా, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించేలా పాకల బీచ్ ను మరింత అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి తెలిపారు.

శనివారం మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు తో కలిసి పాకల బీచ్ ను సందర్శించి, సంబంధిత అధికారులతో కలసి బీచ్ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పాకల బీచ్ ను అభివృద్ధి చేసేందుకు చేపట్టాల్సిన పనులు, తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి, జిల్లా కలెక్టర్ తో కలసి సంబంధిత అధికారులతో సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,పర్యాటకులను మరింత ఆకర్షించేలా, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించేలా పాకల బీచ్ ను మరింత అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు మాట్లాడుతూ, పర్యాటకులను మరింత ఆకర్షించేలా, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించేలా పాకల బీచ్ ను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పరిసరాలు సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. బీచ్ వద్ద మంచి మొక్కలు నాటాలని, పర్యాటకులకు ఆహ్లాదాన్ని కలిగించేలా నిర్మాణాలు జరగాలన్నారు. మరుగుదొడ్లు, స్నానపు గదులు, దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేకంగా గదులను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.   

బీచ్ పరిసర ప్రాంతాల్లో లైటింగ్ ఏర్పాట్లుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. 

సంబంధిత శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పాకల బీచ్ సమగ్ర అభివృద్ధి కి ప్రణాళికలు రూపొందించాలని జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ అధికారిని ఆదేశించారు.

ఈ సందర్భంగా మంత్రి, జిల్లా కలెక్టర్ తో కలిసి బీచ్ పరిసర ప్రాంతంలో మొక్కలను నాటడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ శ్రీమతి కళావతి, జిల్లా పరిషత్ సిఈఓ శ్రీ చిరంజీవి, డిపిఓ శ్రీ వెంకటేశ్వర రావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా వెంకటేశ్వర రావు, మత్స్య శాఖ జేడి శ్రీనివాస రావు, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎస్ఈ శ్రీ బాల శంకర రావు, సిపిడిసిఎల్ ఎస్ఈ శ్రీ వెంకటేశ్వర రావు, పర్యాటక శాఖ అధికారిని. శ్రీరమ్య, ఆర్టిసి ఆర్ఎం శ్రీ సత్యనారాయణ రావు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 Add



Post a Comment

Previous Post Next Post