స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమంలో భాగంగా వరదలు, అంటువ్యాధుల నివారణపై అవగాహన.
చంద్రయ్యపేట గ్రామం వాసుదేవ్ నాయుడు ఆధ్వర్యంలో.
కే కోటపాడు, అక్టోబర్ 19.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర” కార్యక్రమానికి అనుసంధానంగా, అనకాపల్లి జిల్లా, కే. కోటపాడు మండలం, చంద్రయ్యపేట పంచాయితీ లోని టిడిపి ఆధ్వర్యంలో “వర్షాకాలంలో వరదలు మరియు అంటువ్యాధుల నివారణ” పై ప్రజల్లో అవగాహన కార్యక్రమం శనివారం ఉదయం నిర్వహించారు.
మాడుగుల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ సబ్బవరపు పుష్పావతి రామనాయుడు, గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సబ్బవరపు వాసుదేవ నాయుడు, అలాగే సబ్బవరపు అప్పలనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
“వర్షాకాలంలో ప్రజలు తప్పనిసరిగా మరిగించిన లేదా శుద్ధి చేసిన నీరు మాత్రమే తాగాలి. బయట ఆహారాన్ని నివారించాలి. దోమల పెంపకానికి కారణమయ్యే నీటి నిల్వలను వెంటనే తొలగించాలి” అని సూచించారు. ప్రతి ఇంటింటికి వెళ్లి సైకిల్ పై వీధి వీధినా తిరిగి
ఆరోగ్య రక్షణ చర్యలను నిరంతరం కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో చంద్రయ్యపేట గ్రామంలోని మహిళలు, టిడిపి నాయకులు, యువత తదితరులు పాల్గొన్నారు.
