ఒంటి కాలి పై నిలబడి నిరసన.

ఒంటి కాలి పై నిలబడి నిరసన.


క్రైమ్ 9మీడియా ప్రతినిధి. బి. శ్రీనివాస్.
పార్వతీపురం.
గిరిజన విద్యార్థుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని కోరుతూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట రిలే నిరాహారదీక్షలు ఆరో రోజు శనివారం కొనసాగించారు.
ఈ సందర్భంగా శనివారం "ఒంటికాలి"పై నిలబడి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.రవి కుమార్, సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పి.సంగం మాట్లాడుతూ 
గిరిజన సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించే వరకు పోరాటం చేస్తామని, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో, వసతి గృహాల్లో ఏఎన్ఎమ్ లను నియమించాలని డిమాండ్ చేశారు.
మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రధాని సభ లో ప్రమాదం లో మృతి చెందిన వ్యక్తి కి పరిహారం ఇచ్చిన అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం గిరిజన విద్యార్థులు మృతి చెందిన పరిహారం ఎందుకు ఇవ్వడం లేదని నిలదీశారు.
అంతరిక్షంలో మనుషులు వెళ్లి బ్రతుకుతున్న ఈ రోజుల్లో ఇప్పటికీ గిరిజన ప్రజలు, విద్యార్థులు సురక్షిత తాగునీరు నీరు, పౌష్టికాహారం ,మెరుగైన వైద్యం లేక చనిపోవడం ఏమిటని ప్రశ్నించారు.
ఇది పాలకుల నిర్లక్ష్యం కాదా ?అని ధ్వజమెత్తారు.
గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, విద్యా శాఖ మంత్రి బాధ్యత లేకుండా ఉన్నారని చెప్పారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధితులకు సాయం చేసినా అధికారంలో ఉన్న వారు కనీసం జాలి చూపడం లేదని అన్నారు.
దీక్ష లో గౌరీశ్వరీ,రమణమ్మ, చంద్ర కళ, నక్షత్ర, రాజేశ్వరి, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post