ఆగ్రోస్ చైర్మన్,టీడీపీ నేత సుబ్బానాయుడు మృతి బాధాకరం.
సుబ్బానాయుడు మృతితో నిబద్ధత, అంకిత భావం కలిగిన కుటుంబ సభ్యున్ని టీడీపీ కోల్పోయింది.
మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.
నెల్లూరు జిల్లా దగదర్తిలో మాలేపాటి సుబ్బానాయుడు అంత్యక్రియల్లో ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొన్న మంత్రి డా.స్వామి.
నెల్లూరు / దగదర్తి, అక్టోబర్ 21 :
సుబ్బానాయుడు మృతితో నిబద్ధత, అంకిత భావం కలిగిన కుటుంబ సభ్యున్ని టీడీపీ కోల్పోయిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. సోమవారం నాడు నెల్లూరు జిల్లా దగదర్తిలో ఆగ్రోస్ చైర్మన్, టీడీపీ నేత మాలేపాటి సుబ్బానాయుడు అంత్యక్రియల్లో ప్రభుత్వ ప్రతినిధిగా మంత్రి డా.స్వామి పాల్గొన్నారు. సుబ్బానాయుడు మృతదేహానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యుల్ని మంత్రి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.....సుబ్బానాయుడు మృతి బాధాకరం,సుబ్బానాయుడు పార్టీకి చేసిన సేవలు ఎనలేనివి, ఆయన మృతి పార్టీకి తీరని లోటు.సుబ్బానాయుడు కావలి నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేశారు. ఆయన మృతితో
నిబద్ధత, అంకితభావం కలిగిన కుటుంబ సభ్యున్ని టీడీపీ కోల్పోయింది. సుబ్బానాయుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు.
Add

