సూపర్ జీఎస్టీ సూపర్ సేవ్ ప్రచార ముగింపు.



 సూపర్ జీఎస్టీ సూపర్ సేవ్ ప్రచార ముగింపు.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఒంగోలు తగ్గిన జిఎస్టి ధరలు ప్రజల జీవితాలలో మరిన్ని దీపావళి వెలుగులు నింపుతున్నాయని జాయింట్ కలెక్టర్ ఆర్.గోపాలకృష్ణ అన్నారు. "సూపర్ జీఎస్టీ - సూపర్ సేవింగ్స్" ప్రచార ముగింపు కార్యక్రమం ఆదివారం ప్రకాశం భవనంలో ఘనంగా జరిగింది. జీఎస్టీ శాఖ డిప్యూటీ కమిషనర్ సత్య ప్రకాష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిఎస్టి తగ్గటం వలన వివిధ రకాల వస్తువుల ధరలు గణనీయంగా తగ్గాయి అన్నారు. 

దసరా శరన్నవరాత్రుల ప్రారంభం నుంచి దీపావళి వరకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వివిధ రూపాలలో ఇందుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలను జిల్లా యంత్రాంగం తరఫున నిర్వహించినట్లు చెప్పారు. 

ఈ ప్రచార కార్యక్రమాల ముగింపు సందర్భంగా ప్రకాశం భవనంలో జాయింట్ కలెక్టర్ తో సహా వివిధ శాఖల అధికారులు, సిబ్బంది బాణసంచా కాల్చి సంతోషం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలందరికీ ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. 

           ఈ కార్యక్రమంలో డిఎంహెచ్వో వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, రవాణా శాఖ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గారి కుమారులు కూడా పాల్గొని జాయింట్ కలెక్టర్ అధికారులకు మిఠాయిలు పంచిపెట్టారు.

Add


Post a Comment

Previous Post Next Post