పేదవారు ఆరోగ్యంగా ఉంటేనే సీఎం చంద్రన్నకు ఆనందం.


 పేదవారు ఆరోగ్యంగా ఉంటేనే సీఎం చంద్రన్నకు ఆనందం.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఆనారోగ్యంతో బాధపడే వారికీ, ఆపన్న హస్తం.. ముఖ్యమంత్రి సహాయనిధి.

గిద్దలూరు నియోజకవర్గంలోని 100 మంది లబ్ధిదారులకు రూ,54,50,093-00 లు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణి చేసిన ముత్తుముల 

 ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సోమవారం ఉదయం నియోజకవర్గంలో ఆనారోగ్యంతో బాధపడుతున్న 100 మందికీ 8వ విడతగా మంజూరు అయిన, రూ,54,50,093-00 లు ( అక్షరాల యాభై నాలుగు లక్షల యాభై వేల తొంబై మూడు రూపాయలు) ముఖ్యమంత్రి సహాయ నిధి, చెక్కులను అందచేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదవారు ఆరోగ్యంగా ఉంటేనే సీఎం చంద్రన్నకు ఆనందం, ఆనారోగ్యంతో బాధపడే వారికీ ముఖ్యమంత్రి సహాయనిధి అనేది ఒక ఆపన్న హస్తం అని, పేదలకు నాణ్యమైన వైద్యం అందించటమే ఎన్డీయే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ప్రస్తుతం పట్టణాల్లోని కార్పొరేట్ హాస్పిటల్స్ లో పేదవారు నాణ్యమైన వైద్యం పొందవచ్చునని, వారికీ అయిన ఖర్చును ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పొందవచ్చునన్నారు.. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ అనేకమంది పేద ప్రజలు ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనుచున్నారని వారికీ అండగా నిలవాలన్నదే చంద్రన్న కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు. పేద ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందిస్తుందన్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలోని 440 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 4,64,97,216 -00 లు (అక్షరాల నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల తొంబై ఏడు వేల రెండు వందల పదహారు రూపాయలు) అందచేయటం జరిగిందన్నారు. ప్రభుత్వం చేసిన మేలును ప్రతీ ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తుందని రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమన్నారు.. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Add


Post a Comment

Previous Post Next Post