124 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత.
ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదలకూ కార్పొరేట్ వైద్యం.
మెరుగైన వైద్యం కోసమే సంస్కరణలు.
పీపీపీ విధానంపై జగన్ అసత్య ప్రచారాలు.
ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.
అద్దంకి
ముఖ్యమంత్రి సహాయ నిధితో పేదలకు మరింత మెరుగైన కార్పొరేట్ వైద్యం అందుతుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
బాపట్ల జిల్లా అద్దంకిలోని క్యాంప్ కార్యాలయంలో మంత్రి గొట్టిపాటి ఆదివారం నాడు 124 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ., ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పేదల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించిందన్నారు. అనారోగ్యానికి గురైతే అది కుటుంబ ఆర్థిక స్థితిపై భారం పడుతుందన్నారు. పేదలకు అటువంటి ఆర్థిక పరమైన, ఇతర ఇబ్బందులు తొలగించేందుకే వైద్య, ఆరోగ్య శాఖలో సీఎం చంద్రబాబు అనేక సంస్కరణలు తీసుకొచ్చినట్లు వివరించారు. రూ.69 లక్షల విలువైన చెక్కులను అందుకున్న లబ్ధిదారులు ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.
అందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు తీసుకొచ్చిన సంస్కరణలపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు.
ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే కూటమిపై అక్కసు వెళ్లగక్కుతున్నారని ఆయన విమర్శించారు.
రాష్ట్రంలోని వైద్య కళాశాలలను వేగంగా పూర్తి చేసేందుకు పీపీపీ విధానాన్ని తీసుకొచ్చారని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. వైద్య కళాశాలలు త్వరితగతిన పూర్తయితే మరింత ఎక్కువ మంది ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు.
ప్రభుత్వ చర్యలపై విష ప్రచారం చేయడమే కాకుండా., పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్మాణం చేసేందుకు ముందుకు వచ్చే సంస్థలను కూడా జగన్ రెడ్డి బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన విధంగానే ఇప్పుడు కూడా రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు.
Add


