గంట రమేష్ పై చర్యలు తీసుకోవాలి.
ఇసుక మాఫియా గంట రమేష్ మణుగూరు పోలిస్ స్టేషన్ లోనే రైతుపై దాడి చేయడం ప్రజా స్వామ్యానికి సిగ్గుచేటు.
తెలంగాణ
(మణుగూరు, 12,అక్టోబర్,2025, క్రైం 9 మీడియా, తాటి మధు)
ఆదివాసీ హక్కుల పోరాట సమితి "తుడుందెబ్బ" రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లెం కోటి మాట్లాడుతూ,.. మణుగూరు మండలం, రాయిగూడెం ఇసుక ర్యాంపు రెజింగ్ కాంట్రాక్టర్ గంట రమేష్ మరియు తదితర కాంట్రాక్టర్ లు రేజింగ్ కాంట్రాక్టర్ లుగా ఉంటూ ఆదివాసీల మధ్య చిచ్చు పెడుతున్నారు. వీరు ఆడిందే ఆటగా పాడింది పాటగా ఇసుక దందా నడిపిస్తున్నారు. ఏజన్సీ ప్రాంతంలో పీసా చట్టం, 1 అఫ్ 70 చట్టాన్ని ఉల్లంఘిస్తూ తదితర డిపార్ట్మెంట్ లను వారికున్న పలుకుబడితో లోబరుచుకొని స్థానిక ఎంఎల్ఏ పేరు చెబుతూ నీళ్లు, నిధులు, నియామకాలు, జల్, జంగిల్ లను దోచుకుంటున్నారు. సాక్షాత్తుగా మణుగూరు పోలిస్ స్టేషన్ లోనే ఒక రైతు సీఐ ముందే ప్రశ్నిస్తే రేజింగ్ కాంట్రాక్టర్ గంట రమేష్ ఆ రైతు పెదాలు పగిలేలా దాడి చేసి గాయపరిచాడు. ప్రజలకు ,సమాజానికి రక్షణ కల్పించాలేని పోలిస్ వ్యవస్థ నిద్రపోతుంది. ప్రజాస్వామ్యం ఉన్నట్ల లేనట్లా అని ప్రశ్నిస్తున్నాం.
డా|| బిఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం రాసి ప్రజలకు అందిస్తే సమీకరించు, బోధించు, పోరాడు నినాదం ఎక్కడ ఉన్నది. ఈ యొక్క ఇసుక మాఫియా గంట రమేష్ వాగులు, వంకలు, గోదావరి తేడా లేకుండా కోట్లాది రూపాయల ఖనిజ సంపద దోచుకుపోతున్నాడు. తనకి స్థానిక ఎంఎల్ఏ అండ దండలు ఉన్నాయని రెచ్చిపోతూ రెవిన్యూ, ఫారెస్ట్ లో గ్రావెల్ తొలి గోదావరి ఇసుక ర్యాంపులకు రహదారులు నిర్మిస్తున్నాడు. వీటిపై చర్యలెక్కడ .! వాటికి అనుమతులు ఎక్కడ .? ఇట్టి విషయంపై లంబాడీ సామాజిక వర్గనికి చెందిన టీ.జి.ఏం. డి. సి, పీవో ఐటీడీఏ పర్యవేక్షణలు ఎక్కడున్నాయి. ఇసుక జీరో దందా నడుస్తుంటే మీకు కనబడడం లేదా.! అలాగే కమల పురం, రాయి గూడెం, ఉడత నేని గుంపు , కొమరం భీం నగర్ లో భారీ ఇసుక లారీలు తిరుగుతుందడంతో అక్కడి ప్రజలు వల్ల పిల్లల్ని పాఠశాలకు పంపించలేని పరిస్థితి ఏర్పడ్డది, దుమ్ము, ధూళి సౌండ్ పొల్యూషన్ తో ప్రజలకు అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటిపై పీవో ఐటీడీఏ భద్రాచలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఈసందర్భంగా ప్రశ్నిస్తున్నం. ఇప్పటికైనా వెంటనే గంట రమేష్ పై చర్యలు తీసుకోవాలని లేనియెడల తుడుందెబ్బ భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.
Add

