టీడీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకి చంద్రబాబు నాయుడు, లోకేష్ అండగా ఉన్నారు.

టీడీపీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకి చంద్రబాబు నాయుడు, లోకేష్ అండగా ఉన్నారు.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

టీడీపీ కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివిటీడీపీ కార్యకర్తల నిబద్ధత, త్యాగాలు, సేవల్ని ప్రత్యర్థులు సైతం ప్రశంసించాల్సిందే.

మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి.

ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబ సభ్యులకు కార్యకర్తల సంక్షేమ భీమా రూ.5 లక్షల చెక్కు అందజేసిన మంత్రి డా.స్వామి.

ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెం, 

తెలుగుదేశం పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ అండగా ఉన్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఇటీవల ప్రమాదంలో మృతి చెందిన పొన్నలూరు మండలం తిమ్మపాలెం గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త మాధవ నోసినా కుటుంబ సభ్యులకు ఆదివారం నాడు టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెం క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సంక్షేమ భీమా రూ.5 లక్షల చెక్కును మంత్రి డా.స్వామి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....టీడీపీ జెండా మోసిన ప్రతి ఒక్కరికి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, యువనేత లోకేష్ అండగా ఉన్నారు.దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనివిధంగా టీడీపీ కార్యకర్తల కోసం యువనేత లోకేష్ సంక్షేమ నిధి ఏర్పాటు చేశారు.కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా లోకేష్ తానున్నాననే భరోసానిస్తున్నారు.టీడీపీ కార్యకర్తల త్యాగాలు వెలకట్టలేనివి, టీడీపీ కార్యకర్తల నిబద్ధత, త్యాగాలు, సేవల్ని ప్రత్యర్థులు సైతం ప్రశంసించాల్సిందేనని మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్త మాధవ నోసినా కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు నారా లోకేష్, డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి స్వామికి కృతజ్ఞతలు తెలిపారు.

Add


 

Post a Comment

Previous Post Next Post