మండలంలోని వాగులను పరిశీలించిన అధికారులు.
జిల్లా క్రైమ్ 9మీడియా ప్రతినిధి దాసరి యోబు.
మొంథా తుపాన్ నేపథ్యంలో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లా కంభం మండలము లో ఈరోజు రావిపాడు సమీపంలోని గుండ్లకమ్మ బిడ్జి వాగు. సూరేపల్లి సమీపంలో ఉన్న నల్ల వాగు. కంభం చెరువును పరిశీలించిన మండల తహసీల్దార్. వి కిరణ్ కుమార్. మరియు కంభం సబ్ ఇన్స్పెక్టర్ బి. నరసింహ రావు.
తాసిల్దారు మాట్లాడుతూ భారీ వర్షాలకు తగు జాగ్రత్తగా తీసుకోవాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్యవసరమైతే బయటికి వచ్చి మీ పనులు ముగించుకొని త్వరగా ఇండ్లకు వెళ్ళవలెనని కోరారు.
సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ. బ్రిడ్జి ల దగ్గర వాగుల దగ్గర తగు జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే ద్విచక్ర వాహనాల మీద వెళ్లే వారు వర్షా ప్రభావంతో ప్రమాదాలు జరిగవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలని. ఆయన తెలియజేశారు. అత్యవసర వేళలో ప్రమాదాలు గమనించి టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగలరని అధికారులు ప్రజలకు తెలియజేశారు.
Add


