దీపావళి సందర్భంగా జిల్లా ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి — జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.


 దీపావళి సందర్భంగా జిల్లా ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి — జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా.

క్రైమ్ 9మీడియా ప్రతినిధి, జిల్లా ఇంచార్జి (క్రైమ్).

పి. మహేశ్వరరావు.

అనకాపల్లి, అక్టోబర్ 10: దీపావళి పండుగతో పాటు ఇతర వేడుకల సందర్భంగా బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయం వంటి కార్యకలాపాలు నిర్వహించే వారు ప్రభుత్వ నిబంధనలు మరియు అగ్నిమాపక భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలి అని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.ఇటీవల జిల్లాలోని కోటవురట్ల మండలం, కైలాసపట్నం గ్రామం, కోనసీమ జిల్లా, రాయవరం మండలం, వి.సవరం గ్రామంలో చోటుచేసుకున్న ప్రమాదకర ఘటనలను దృష్టిలో ఉంచుకుని, ప్రజల ప్రాణ భద్రత కోసం బాణాసంచా తయారీ మరియు నిల్వ కేంద్రాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.

అనుమతులు లేకుండా లేదా భద్రతా ప్రమాణాలు పాటించకుండా బాణాసంచా తయారు చేయడం, నిల్వ చేయడం లేదా విక్రయించడం పూర్తిగా నిషేధించబడింది.

జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని బాణాసంచా గోదాములు, తయారీ కేంద్రాలు మరియు విక్రయ కేంద్రాలపై ఆకస్మిక తనిఖీలు కొనసాగుతున్నాయి.

భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించినా, ఫైర్ సేఫ్టీ పరికరాలు లేకుండా లేదా తగిన భద్రతా సిబ్బంది లేకుండా బాణాసంచా నిల్వ లేదా తయారీ జరిగితే, సంబంధితులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో అనధికారిక బాణాసంచా తయారీ, నిల్వ లేదా విక్రయం జరుగుతున్నట్లు గమనించిన వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 112 నంబర్‌కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, పేర్కొంటూ — “ప్రజల భద్రతే మా ప్రధాన లక్ష్యం — మీ సహకారమే మా బలం. బాణాసంచా ప్రమాదాల నివారణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి” అని తెలిపారు.

Add


Post a Comment

Previous Post Next Post