గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగుతున్న అద్దె ఎలక్ట్రిక్ బస్సులు.
సందిగ్ధంలో 15,000 మంది ఉద్యోగుల భవిష్యత్తు.
తెలంగాణ : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దశలవారీగా ఆర్టీసీ సొంత బస్సులు మాయం అవుతున్నాయని, ఎలక్ట్రిక్ బస్సులు అద్దెకు తెచ్చి నడపడం వల్ల 15,000 మంది కార్మికుల ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆర్టీసీ కార్మిక సంఘాల ఆందోళన.
ఎలక్ట్రిక్ బస్సుల పేరిట జరిగే ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్న ఆర్టీసీ ఉద్యోగులు.
హైదరాబాద్ పరిధిలో ఉద్యోగాలు కోల్పోయే కార్మికులను వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వాలని, ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని ఆర్టీసీ యాజమాన్యం కుట్ర చేస్తుందని ఆరోపిస్తున్న కార్మిక సంఘాలు.
ఆర్టీసీ బస్సులను ప్రైవేటు సంస్థలు నడపడం వల్ల సంస్థకు ఎలాంటి లాభం లేదని, ప్రధాన మంత్రి సబ్సిడీ కూడా ప్రైవేటు సంస్థలకే వస్తుందని ఉద్యోగుల వ్యాఖ్యలు.
ఉచిత బస్సు పథకానికి, ప్రైవేటు బస్సుల ప్రక్రియ తోడైతే, ప్రజల మీద మోయలేనంత భారం పడుతుందని ఆర్టీసీ కార్మికుల విశ్లేషణ. ఎలక్ట్రిక్ బస్సులు ప్రైవేట్ సంస్థలకు ఇస్తే ఉద్యోగులకు, ఆర్టీసీ సంస్థకు నష్టమే మిగులుతుందని, ఈ విషయంపై ప్రభుత్వం పునరాలోచించాలని డిమాండ్ చేస్తున్న కార్మిక సంఘాల నాయకులు.
