జూబ్లీహిల్స్‌లో వాహన తనిఖీలు..రూ.9 లక్షల నగదు సీజ్.
హైదరాబాద్: ఎన్నికల కోడ్ నేపథ్యంలో రూ.9 లక్షల నగదును పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీసులు రోడ్ నంబర్ 5లోని మెట్రోస్టేషన్ వద్ద ఎస్‌ఐ జగదీష్ ఆధ్వర్యంలో గురువారం వాహన తనిఖీలు చేపట్టారు. అదే సమయంలో ఎల్‌బీనగర్ సరస్వతీనగర్ కాలనీలో నివాసముంటున్న బిల్డింగ్ మెటీరియల్ సూపర్‌వైజర్ అయితగోని రవి చేతిలో బ్యాగుతో మెట్రో స్టేషన్ మెట్లు ఎక్కుతూ అనుమానాస్పదంగా కనిపించాడు.
పోలీసులు అతడి బ్యాగు తనిఖీ చేయగా భారీగా నగదు కనిపించింది. ఆ డబ్బు లెక్కించగా రూ.9 లక్షలు అని తేలింది. నగదుకు సంబంధి పత్రాలు చూపించలేక పోవడంతో పోలీసులు నగదును సీజ్ చేసి ఎన్నికల అధికారికి అప్పగించారు.
