పదుల సంఖ్యలో బెల్ట్ షాపులులో మద్యం అమ్మకాలు.
బెల్ట్ షాపులు గురించి కొత్తపేట పోలీసులకు ఎక్సైజ్ పోలీసులకు ముందే తెలుసు.
మామూళ్ల అందుకుంటున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ దిలీప్.
బీట్ కానిస్టేబుల్ కు మామూళ్ళు.
క్రైమ్ 9మీడియా ప్రతినిధి శ్రీనివాస్
(విజయవాడ)
విజయవాడ రూరల్ మండలం కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్తూరు తాడేపల్లి లో అక్రమంగా పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు ఉన్నాయని తెలుస్తోంది, కోడి కూత కూయడంతో బెల్ట్ షాపుల్లో అక్రమ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.
ఈ ప్రాంతంలో అక్రమ బెల్టు షాపులకు దొరబాబు అనే వ్యక్తి అర్ధరాత్రులు మద్యం సరఫరా చేస్తూ ఉంటాడని, బెల్ట్ షాపు నిర్వాహకులు చెబుతున్నారు.
ఇదిలా ఉండగా భవానిపురం లో ఉన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న దిలీప్ అనే కానిస్టేబుల్ నెలవారి మామూళ్ళు తీసుకెళ్తూ ఉంటారని, ఎక్స్చేజ్ అధికారులను మేనేజ్ చేసుకుంటూ బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నామని బెల్ట్ షాపు నిర్వాహకుడు వాపోయాడు.
ఇదే తరుణంలో కొత్తపేట పోలీసులు కూడా వచ్చి బీట్ మామూళ్ళు తీసుకుంటారని ఇటు ఎక్సైజ్ అధికారులకు ఇటు పోలీస్ అధికారులకు బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మకాల గురించి తెలుసునని ఇదంతా వారి కనుసైగలోనే జరుగుతున్నట్లుగా బెల్ట్ షాపు నిర్వాహకుడు వాపోతున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది.
Add

