వృద్ధుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపేట వేస్తోంది-ఎమ్మెల్యే రోషన్ కుమార్.
వృద్ధులు సమాజంలో మార్గ దర్శకులు అని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ లో ప్రపంచ వృద్ధాప్య దినోత్సవము ను పురస్కరించుకొని జరిగిన వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారికి శుభాకాంక్షలు తెలిపారు.
వృద్ధులు విజ్ఞాన గనులనీ, వారి జీవితంలో అనేక అనుభవాలు , ప్రావీణ్యాలు కలిగి ఉంటారని.. వారీ అనుభవాలను నేటి యువత వినియోగించుకుని భవిష్యత్తులో ఉన్నతమైన జీవిత విధానాలతో ముందుకు సాగాలని కోరారు.
బాపూజీ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహించబడటం అభినందనీయమన్నారు.
అనంతరం రోటరీ క్లబ్ నిర్వాహకులకు సన్మానం చేసి గౌరవించారు,
ఈ కార్యక్రమం లొ కూటమి నాయకులు, కార్యకర్తలు, సీనియర్ సిటిజెన్స్ పాల్గొన్నారు.
Add


