గిద్దలూరు నియోజకవర్గ క్రైమ్ 9 మీడియా ప్రతినిధి బి అమృత రాజ్.
ముత్తుములను సన్మానించిన బోనేని దంపతులు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు కొమరోలు మండలం తెలుగుదేశం పార్టీ మరియు అమ్మ ఫౌండేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు డా. బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ గారి సతీమణి రమణమ్మకు శ్రీశైలం దేవస్థానం ట్రస్టు బోర్డులో సభ్యురాలుగా గిద్దలూరు నియోజకవర్గం శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి సిఫారసుతో ప్రభుత్వం రమణమ్మకు ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా అవకాశం కల్పించారు.
దీనితో బోనేని రమణమ్మ, ఆమె భర్త వెంకటేశ్వర్లు యాదవ్ గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి ని గిద్దలూరు తెదేపా కార్యాలయంలో కలిసి శాలువాలు పూలమాలలతో ఘణంగా సన్మానించి కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ సందర్బంగా తెదేపా నాయకులు, యాదవ సంఘాల ప్రతినిధులు బోనేని దంపతులను కూడా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెదేపా పార్టీ నాయకులు, యాదవ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
