సమాజంలో పేద విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి.కలెక్టర్.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యమని, సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టళ్ళలో ఉంటున్న పేద విద్యార్థులకు మంచి విద్య, భోజనము, వసతితోపాటు వారి ఆరోగ్యంపైనా మరింత దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు, అధికారులను ఆదేశించారు.
బుధవారం ఒంగోలు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, సాంఘిక సంక్షేమ శాఖ, బిసి సంక్షేమ, గిరిజన సంక్షేమ, ఐసిడిఎస్., మైనారిటీ, దివ్యాంగుల తదితర సంక్షేమ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశమై, రెసిడెన్షియల్ విద్యాలయాలతో పాటు హాస్టళ్లలో ఉన్న మౌలిక సదుపాయాలు, సొంత - అద్దె భవనాలు, వాటిని ఉన్నతాధికారులు తనిఖీ చేస్తున్న తీరు, విద్యార్థులకు అందచేస్తున్న ఆహార నాణ్యత, మెనూ అమలు - సమస్యలు, నిర్వహిస్తున్న వైద్య పరీక్షలు తదితర వివరాలపై జిల్లా కలెక్టర్ సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాస్టళ్ళలో ఉంటున్న పేద విద్యార్థులకు మంచి విద్య, భోజనము, వసతితో పాటు వారి ఆరోగ్యంపైనా మరింత దృష్టి సారించాల్సిన భాద్యత సంబంధిత అధికారులపై ఉందన్నారు. మండలాన్ని యూనిట్ గా తీసుకుని మండలంలోని ప్రతి హాస్టల్ ను ఒక మండల అధికారి దత్తత తీసుకొని పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అధికారులు హాస్టళ్ళను తనిఖీ చేసేలా ట్యాగ్ చేస్తే వారు కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. హాస్టళ్ళలో మరుగుదొడ్ల ఏర్పాటు, పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ద తీసుకోవడం తో పాటు మంచి వాతావరణంలో చదువుకునేలా స్టడీ రూమ్ వంటి ఏర్పాట్ల పై దృష్టి సారించాలన్నారు. హాస్టల్స్ లో మైనర్, మీడియం వర్క్స్ కింద చేపట్టిన పనులను త్వరగా వినూత్నంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం భవనాలలో నడుస్తున్న హాస్టల్స్ భవనాలపై సోలార్ సిస్టం ను ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్, సూచించారు. హాస్టల్స్ లోని పిల్లలకు నాణ్యమైన, రుచికరమైన పుడ్ ను అందించేలా సంబంధిత వంటవారికి శిక్షణ కార్యక్రమాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు. మహిళా చట్టాలు, మహిళా సాధికారత, సంక్షేమం గురించి, భవిష్యత్ లక్ష్యాల గురించి, సామజికంగా యువతులు ఎదురుకుంటున్న సమస్యల గురించి, ఏవిధంగా పరిష్కారం చేసుకోవొచ్చో అవగాహన కల్పించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
హాస్టల్స్ లోని పిల్లలకు పాఠ్యాంశాలను బోధించేందుకు టూటర్లను కూడా పూర్తిస్థాయిలో నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. అన్నీ శాఖల ను సమన్వయం చేసుకుంటూ హాస్టల్స్ అభివృద్ధిపరిచే విధంగా అధికారులు పనిచేయాల్సి ఉంటుందని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లక్ష్మానాయక్, బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, ఐసిడిఎస్ పిడి సువర్ణ, దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు సువార్త, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారి జయ, ఎస్సి, బిసి కార్పొరేషన్ ఈడి లు అర్జున్ నాయక్, వెంకటేశ్వర రావు తదితర అధికారులు పాల్గొన్నారు.
Add


