గంజాయి మరియు మత్తు పదార్థాలపై తనిఖీలు నిర్వహించిన కంభం పోలీసులు.
ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
ప్రకాశం జిల్లా ఎస్పీ వి హర్షవర్ధన్ రాజు అదేశాల మేరకు కంభం పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ తోపాటు పరిసర ప్రాంతాలను పోలీసు జాగిలం రాక్సీ తో విస్తృతంగా పోలీసు సిబ్బంది తనిఖీలు నిర్వహించడం జరిగింది.
ప్రకాశం జిల్లా కంభం బస్టాండ్ లో ప్రయాణికులు రద్దీగా ఉన్న సమయంలో జేబు దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తారని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
అంతే కాకుండా మనకు తెలియకుండానే కొందరు వ్యక్తులు ఇతర మత్తు పదార్థాలను అక్రమంగా బస్సులలో. ప్రైవేట్ పార్సిల్ సర్వీస్. రవాణా చేస్తుంటారని ప్రజలకు పోలీసు వారు తెలియ చేసారు. అలాంటి వారి పట్ల ప్రజలు ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తనిఖీల భాగంగా మత్తుపదార్థాల అరికట్టేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చిన రాక్సి జాగిలంతో బస్టాండ్ లో తనిఖీలు చేస్తున్నామని ప్రయాణికులకు పోలీసు వారు తెలిపారు.
నిరంతరం తనిఖీలు చేయడం వల్లన అసాంఘిక కార్యక్రమాలు చేసే వారిని కట్టడి చేయడం జరుగుతుందన్నారు. ప్రజలందరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే కంభం రైల్వేస్టేషన్ లోను రాక్సి డాగ్ తో అణువణువునా తనిఖీలు చేశారు. రైలుమార్గం ద్వారా కొంత మంది వ్యక్తులు గంజాయి... అక్రమ రవాణా చేస్తున్నారని వాటిని అరికట్టేందుకు తనిఖీలు చేశారు.
ఫ్లాట్ ఫామ్ పైన ప్రతి వస్తువును తనిఖీలు చేశారు. రైల్వేస్టేషన్. ఆర్టీసీ బస్టాండ్.లోని పార్సిలు సర్వీసు లో రాక్సీ జాగిలంతో తనిఖీలు చేశారు. అనుమానం వచ్చిన పార్సిలు ను అధికారుల సమక్షంలో ఓపెన్ చేసి మరీ తనిఖీలు నిర్వహించారు.
అనుమానం వచ్చిన ప్రయాణికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో. ప్రయాణికులకు ఇబ్బందికరమైన వాసన వస్తే వేంటనే రైలులో ఉన్న గార్డ్ మరియు సిబ్బంది కు సమాచారం ఇవ్వాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేసార్.
రైలు లో ఎవరైనా గంజాయి కాని, ఇతర మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఈ తనిఖీలో కంభం సర్కిల్ ఇన్స్పెక్టర్.మల్లికార్జునరావు, కంభం సబ్ ఇన్స్పెక్టర్. బి నరసింహారావు, స్పెషల్ పార్టీ సిబ్బంది, డాగ్ హ్యాండ్లర్ వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Add



