నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట శిబిరము పైన పోలీసుల దాడులు.

నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట శిబిరము పైన పోలీసుల దాడులు.

ఏలూరు జిల్లా..నూజివీడు డీఎస్పీ  కె వి వి ఎన్ వి ప్రసాద్  ఆదేశాల మేరకు, నూజివీడు రూరల్ ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ  ఆధ్వర్యంలో నూజివీడు రూరల్ ఎస్సై  జ్యోతిబసు  మరియు సిబ్బంది పేకాట శిబిరాలు పై ప్రత్యేక దాడులు నిర్వహించారు. నూజివీడు మండలం, దేవర కొండ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుండి రూ. 46,450/- నగదు మరియు 52 పేక ముక్కలు సీజ్ చేశారు.

సదరు పట్టుబడ్డ వ్యక్తులపై నూజివీడు రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు చేసినట్లు ఎస్సై  జ్యోతిబసు  తెలియ చేసినారు.

నూజివీడు రూరల్ పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చట్ట విరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనకుండా, తమ గ్రామాల్లో ఎవరైనా ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు లేదా డయల్ 112 కు సమాచారం అందించాలని తెలియ చేసిన- ఎస్ఐ. జ్యోతిబసు  యొక్క సెల్ ఫోన్ నెంబర్ 9440796440 కు సమాచారం అందించిన వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్ఐ గారు తెలియ చేసినారు.
 

Post a Comment

Previous Post Next Post