గిద్దలూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన శాసనసభ్యులు.




 గిద్దలూరు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన శాసనసభ్యులు. 

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరియోబు.

51 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు, డ్రైన్స్ నిర్మాణానికి భూమి పూజ చేసిన శాసనసభ్యులు అశోక్ రెడ్డి.

    ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో రూ. 51 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి గారు భూమి పూజ చేసి శిలాఫలకాలను ప్రారంభించారు. పట్టణంలోని ఎస్టీ కాలనీలో రూ.10.56 లక్షల రూపాయలతో నిర్మాణం చేపట్టనున్న డ్రైనేజీలకు భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ప్రారంభించారు.. 14వ వార్డు అర్బన్ కాలనీలో రూ. 13 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డు, 3వ వార్డు శ్రీరామ్ నగర్ లో రూ.10.00 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్డుకు, కొంగళవీడు రొడ్డులో రూ.18.00 లక్షలతో నిర్మించనున్న సిమెంట్ రోడ్లకు భూమి పూజ చేసి శిలా ఫలకాలను ప్రారంభించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగుస్తున్నామని, గ్రామాల్లో, పట్టణాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనీజీలు, మౌళిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఈ కార్యక్రమంలో గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పాముల వెంకట సుబ్బయ్య, సొసైటీ బ్యాంక్ చైర్మన్ దుత్తా బాల ఈశ్వరయ్య, జిల్లా టీడీపీ నాయకులు కుప్పా రంగసాయి, మున్సిపల్ కమిషనర్ ఈవి. రమణ బాబు, పట్టణ కౌన్సిలర్లు పాలుగుళ్ళ చిన్న శ్రీనివాసరెడ్డి, బిల్లా రమేష్, బూనబోయిన చంద్రశేఖర్, బోయిలపల్లి కిషోర్, వేములపాటి చంటి, కావడి గురువయ్య, ఉలాపు బాలచెన్నయ్య, అబ్బు ఓబయ్య మరియు పట్టణ నాయకులు ప్రజలు తదితరులు పాల్గోన్నారు.

Post a Comment

Previous Post Next Post