క్రైమ్ 9మీడియా ప్రతినిధి. పి మహేశ్వరరావు.
విశాఖపట్నం అక్టోబర్:18
శుక్రవారం అంతర్జాతీయ పేదరిక నిర్మూలన రోజు సందర్భంగా నీరజ హెల్పింగ్ హేండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వందమంది నిరుపేదలకు అల్పాహారం అరటిపళ్ళు త్రాగునీరు అందించడం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ ఫౌండర్ యస్. కె. రత్నం మాట్లాడుతూ మన దేశంలో ఎంతోమంది పేదరికంలో మగ్గిపోతున్నారని, పేదరికాన్ని తొలగించడానికి ప్రభుత్వం మరియు ప్రభుత్వేతర సంస్థలు వివిధ ఆర్థిక మరియు మానవతా మార్గాలలో చర్యలు తీసుకోవాలని, పేదరిక నిర్మూలన అంటే కేవలం డబ్బులు ఇవ్వడం కాదు, పేదవారి ఆత్మగౌరవాన్ని కాపాడటం, వారికి ఎదగడానికి అవకాశాలు కల్పించడం.
పేదలకు కనీస ఆహార భద్రతను అందించాలని,
వెనుకబడిన వర్గాలకు సాధికారత కల్పించడం మరియు సమ్మిళిత అభివృద్ధిని ప్రోత్సహించాలని తెలియజేసారు.
ప్రతి ఒక్కరూ ఉన్నంతలో మరొకరికి కడుపు ఆకలి తీర్చాలని ఆలోచన కలిగి ఉంటే పేదరిక నిర్మూలన అనేది తప్పనిసరిగా చేయొచ్చు అని అందుకు అందరూ సహృదయంతో సంకల్ప భావన కలిగి ఉండాలని తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో చారిటీ ప్రెసిడెంట్ మహాలక్ష్మి సభ్యులు ప్రసాదు, దేవరాజు, ఎల్ శ్రీను, సత్యనారాయణ, శారద పాల్గొన్నారు.
