సింగరాయకొండ,లో స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి. డోలా.
ప్రకాశం జిల్లా కరెంట్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.
పట్టణాలు, పల్లె సీమలు స్వచ్ఛంగా ఉంచే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న
స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పిలుపు నిచ్చారు.
స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ప్రకాశంజిల్లాకొండపినియోజకవర్గం, సింగరాయకొండలో నిర్వహించిన స్వచ్ఛ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి డా, డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పాకల రోడ్డు నుండి కందుకూరు రోడ్డు వరకు నిర్వహించిన సైకిల్ ర్యాలీ ని మంత్రి జెండా ఊపి ప్రారంభించి ర్యాలీ లో పాల్గొన్నారు. మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పాల్గొని మాట్లాడుతూ, పట్టణాలు, పల్లె సీమలు స్వచ్ఛంగా ఉంచే లక్ష్యంతో ప్రతి నెల మూడవ శనివారం నెలకొక థీమ్ తో స్వర్ణ ఆంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో అన్నీ వర్గాల ప్రజలు పాల్గొని తమ ఇంటిని, తమ వార్డును, తమ గ్రామాన్ని పరిశుభ్రంగా, స్వచ్ఛంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. 2015 న దేశ ప్రధాని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించగా, అప్పటి రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించడం జరిగిందన్నారు. 2019 వరకు రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తూ చెత్త నుండి సంపద తయారీ కి చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. పెద్ద నగరాల్లో చెత్త నుండి విద్యుత్ ను ఉత్పత్తి చేయడం, వాడిన నీటిని రీసైక్లింగ్ చేసి పరిశ్రమలకు వినియోగించడం వంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
గ్రామాలను, పట్టణాలను స్వచ్ఛంగా ఉంచడంలో ప్రజల భాగస్వామ్యము ముఖ్యమన్నారు. గతంలో ఆరుబయట స్వచ్ఛమైన గాలితో నిద్రించే వారని, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. ఈ నెల స్వచ్ఛమైన గాలిని పెంపొందించడం అనే ఆలోచన తో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
సింగరాయకొండలోని ప్రధాన రోడ్డు నిర్మాణానికి 3 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయడం జరిగిందని, త్వరలో టెండర్లు పిలిచి పనులు పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. అలాగే చేపల మార్కెట్ ను నవీకరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. రైతు బజారు ఏర్పాటు కు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. త్వరలో సింగరాయకొండలో అన్నాక్యాంటీన్ ను కూడా ప్రారంభించుకోనున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరుగుచున్నదన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రజలకు సమర్ధవంతంగా అమలు జరిగేలా చర్యలు తీసుకుంటూ పేద ప్రజలకు అండగా ఉంటున్నట్లు మంత్రి అన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఇటీవల కాలంలో సుమారు 10 లక్షల ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు.
జిఎస్టినీ తగ్గించడం వలన నేడు నిత్యావసర సరుకులు సుమారు పది శాతం మేర తగ్గడం జరిగి ప్రజలకు మేలు చేకూరే పరిస్థితి ఏర్పడిందన్నారు. జీఎస్టీ తగ్గింపు వలన సుమారు 8 వేల కోట్ల రూపాయలు మేర రాష్ట్రానికి ఆర్థిక భారం పడుతున్నప్పటికీ, ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగిందని మంత్రి అన్నారు.
పేదల సంక్షేమం, అభివృధ్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
ఈ సందర్భంగా క్లాప్ మిత్రులను సన్మానించి వారితో కలసి మంత్రి, అధికారులు ఫోటో దిగారు.
ఈ సందర్భంగా స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సిఈఓ చిరంజీవి డ్వామా పిడి జోసెఫ్ కుమార్, డిపిఓ వెంకటేశ్వర రావు, నియోజకవర్గ స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


