త్రాగే నీరు సురక్షితం అయితే - మనమూ సురక్షితమే.


 త్రాగే నీరు సురక్షితం అయితే -  మనమూ సురక్షితమే.

ప్రకాశం జిల్లా క్రైమ్ 9 మీడియా ప్రతినిధి దాసరి యోబు.

ఒంగోలు పట్టణములోని కరుణా కాలనీ మరియు బిలాల్ నగర్ లో జిల్లా వైద్య ఆరోగ్య విస్తరణ మరియు మీడియా అధికారి బెల్లం నరసింహ రావు ఇంటింటి సందర్శనo 30.10.2025 వ తేదీన చేసి ప్రజలకు ఆరోగ్య అవగాహనా కార్యక్రమము చేపట్టారు. 

మీడియా అధికారి బెల్లం నరసింహ రావు గారు మాట్లాడుతూ..

ప్రజలు వర్షా కాలములో త్రాగేనీరు సురక్షితంగా ఉండాలని, కలుషితమై న నీరు త్రాగారాదని, అతి సార వ్యాది, బంక విరోచినాలు, టైపాయిడ్, కామెర్లు మొదలగు వ్యాదులనుండి రక్షించు కోవాలని తెలియజేయడం జరిగింది. నీరు నిల్వ చేయు ట్యాంక్ లకు తప్పనిసరిగా మూతలు ఉండేటట్లు చూసుకోవాలని, త్రాగే నీటిని సుద్ది చేయటానికి, క్లోరినేషన్ ఉత్తమ పద్దతని, క్లోరినేషన్ చేసిన {సురక్షితమైన} నీటిని త్రాగి, అంటూ వ్యాదులనుండి రక్షణ పొందాలని తెలియజేసారు. త్రాగేనీటిని క్లోరినేషన్ చేయడం వలన హానికర సూక్శ్మ జీవులు నశించి వ్యాదులు అయిన అతిసార, బంక విరోచినాలనుండి కాపాడుకోవాలని తెలియజేసారు. వ్యక్తిగత పరిసుబ్రత పాటించాలని తెలియజేసారు.

దోమలు ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువులు. ఇవి మన ఇండ్లలో, పరిసర ప్రాంతాలలో పెరిగి మలేరియా, డెంగు, చికెన్ గునియా, భోధ వ్యాది, మెదడు వాపు మొదలగు వ్యాదులనుండి ప్రజలు రక్షింప బడాలని తెలియజేసారు. ఆరోగ్యమే మహా భాగ్యమని తెలియజేసారు.

Add


Post a Comment

Previous Post Next Post