నష్టపోయిన ప్రతి ఏకరాను పారదర్శకంగా అంచనా వేసి రైతన్నలను ప్రభుత్వపరంగా ఆదుకుంటాము - నాదెండ్ల మనోహర్.
ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తాము, మీకు అండగా కూటమి ప్రభుత్వం ఉంది..
ధాన్యం సేకరించిన 48 గంటల్లోగా రైతులు ఖాతాలో నగదు జమ చేస్తాము జిల్లా ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్.
ఏలూరు/ పెదపాడు, అక్టోబరు 29: పెదపాడు మండలం వట్లూరు గ్రామంలో నేలకొరిగిన వరిచేలను రాష్ట్ర పౌరసరఫరాలు శాఖ మంత్రి మరియు ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్, జిల్లా కలెక్టరు కె.వెట్రిసెల్వి, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, వడ్డీలు కార్పొరేషన్ చైర్ పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పల నాయుడు లు కలసి పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులు వరిదుబ్బులను చూపించి, తమ బాధలను వ్యక్తం చేశారు. 1318 వరి రకం వేశామని ఒక ఏకరాకు 42 నుండి 44 బస్తాలు దిగుబడి వస్తాయని, గడ్డి కూడా ఎక్కువ వస్తుందని, పశువులకు పనిచేస్తుందని ఆశించామని తెలిపారు. విపత్తులను తట్టుకునే శక్తి 1318 రకానికి ఉందని అయితే రాత్రి కురిసిన భారీ వర్షాలు, భారీ ఈదురు గాలితో వరి పంటలు నేలకొరిగాయని రైతులను ఆదుకోవాలని కోరారు.
స్పందించిన ఇంచార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ నష్టపోయిన ప్రతి ఏకరాను పారదర్శంగా నష్టం అంచనాలు వేసి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని, ఆందోళన చెందవద్దని రైతులకు భరోసానిచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని, కూటమి ప్రభుత్వం రైతులు ప్రభుత్వం అని మీకు అండగా ఉంటామన్నారు. ధాన్యం సేకరించిన 48 గంటల్లోగా రైతులు ఖాతాలో నగదు జమ చేస్తామని, ఆరుగాలం శ్రమించి కష్టపడి పండించిన వరి పంటలకు గిట్టుబాటు ధర అందించటమే మా ప్రధమ కర్తవ్యం అన్నారు. నేలకొరిగిన వరిపంటను దుబ్బులుగా కట్టుకుని వ్యవసాయ శాఖ అధికారులు సూచించిన మందులను డ్రోన్లు ద్వారా స్ప్రే చేసుకోవాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు, సూచనలు పాటించి పంటలను చేతికి వచ్చేలా చూసుకోవాలని రైతులకు సూచించారు.
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ 1318 వరి రకం ఎటువంటి విపత్తులను తట్టుకునే శక్తి ఉందని ఇక్కడ ఎక్కువ మంది రైతులు1318 వరి రకం వేసుకున్నారని తెలిపారు. తుఫాన్ ప్రభావంతో అధిక వర్షాలు, అధిక గాలులు వీచుటవలన రాత్రికి నేలకొరిగాయని తెలిపారు. ఈ ప్రాంత రైతులను ఆయిల్ పామ్ సాగు వైపు ప్రోత్సహిస్తున్నామన్నారు. .
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జెడి షేక్ హబీబ్ భాషా, ఏడిఇ ఇ.అనిత కుమారి, మండల వ్యవసాయ శాఖ అధికారి షేక్ ఖాసీమ్, గ్రామ సచివాలయ సిబ్బంది, రైతులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
